జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పత్తా లేకుండా పోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపే స్థాయిలో తమ ఓటు బ్యాంక్ గణనీయంగా ఉందని భావించే జన సైనికులకు, కాపు సంఘాలుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎంత పొత్తులో ఉన్నప్పటికీ జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయింకపోవడం ఎంటంటూ జనసేనాని తీరుపై వారు బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు..
నిన్నా మొన్నటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, దర్శి,గిద్దలూరులలో ఈ మూడు సీట్లలో కనీసం రెండు సీట్లు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది, చివరికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కాపులు, జనసైనికులు ఖంగుతిన్నారు.
కాపులు, జనసేన సానుభూతిపరులు అత్యధికంగా ఉన్న ఒంగోలు, దర్శి, గిద్దలూరు, కనిగిరి, పర్చూరు వంటి స్థానాల్లో ఉన్న కాపులు, జనసైనికులు ఓట్లు పూర్తి స్థాయిలో టిడిపికి ట్రాన్స్ఫర్ కాలేని పరిస్థితి ఏర్పడింది. జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ నిర్ణయంతో టిడిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదో ఒక సీట్ జనసేనకు కేటాయించుంటే మిగిలిన సీట్లలో ఓటు ట్రాన్స్ఫర్ జరిగేది అని టీడీపీ నేతల వాపోతున్నారు.
ఒకవైపు దర్శి టికెట్ ఆశించిన ఎన్నారై గరికపాటి వెంకట్ తనకే టికెట్ వస్తుందనే ఆశతో గత కొన్ని నెలలుగా నియోజకవర్గం అంతా కలయతిరుగుతూ ఇప్పటికే భారీగా ఖర్చు చేయడంతో పాటు పెద్దమొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు గిద్దలూరు టికెట్ ఆశించిన జిల్లాలోనే బలమైన కాపు నేత ఆమంచి స్వాములు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశాడు. గిద్దలూరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇంత చేసి ఉమ్మడి జిల్లాలో టిడిపి,జనసేనలు కాపులకు ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించక పోవడంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీరుపై కాపు సంఘాలు, జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.