2019 నవంబర్ 20 వ తారీఖున మన నుడి మన నది అనే మహోన్నత కార్యక్రమం ఆరంభించిన పవన్ కళ్యాణ్ గారు , నదీ జలాలు విషమయం కాకుండా పరిరక్షిస్తామని , అమ్మ వడి లాంటి తెలుగు నుడిని కాపడతానని త్వరలో ఇందుకు కార్యాచరణ చేపడతామని చెప్పుకొచ్చారు .
ఆ తర్వాత గడిచిన నాలుగేళ్లలో ఇందుకోసం చేపట్టిన కార్యాచరణ సూన్యం అనే చెప్పవచ్చు. నదీ జలాల పరిరక్షణ ప్రచారం కానీ, నదీ తీరంలో చెత్త పేరుకోకుండా పారిశుధ్య కార్యక్రమం కానీ చేపట్టలేదు, కనీసం నదీ తీరంలో చెత్త శుద్ధి చేయమని తన కార్యకర్తలకైనా పిలుపివ్వలేదు. వారికి స్ఫూర్తి ఇచ్చే విధంగా తానే ఒకరోజు చెత్త ఏరివేత కార్యక్రమం చేపట్టినా కొందరు అభిమానులైనా స్వచ్ఛందంగా ఆ పని చేపట్టేవారు అదీ చేయలేదు. నదీ తీరాలు ఎక్కడెక్కడ కలుషితమవుతున్నాయో గుర్తించి అక్కడి వారికి అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టినా కొంత ఉపయుక్తంగా ఉండేది .
మన నుడి పేరిట తెలుగు భాషా పరిరక్షణకు ఏం చేశాడు అనేది చూస్తే అది కూడా సూన్యమే.
రైల్వే కోడూరులో అతి పెద్ద గ్రంధాలయం కడతానని హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ దాని గురించిన ప్రస్తావన లేదు. పోనీ నుడి పరిరక్షణకు ప్రత్యేక సిలబస్ రూపొందించి పుస్తకాలు ఏమైనా అచ్చోసి పంచాడా అంటే అదీ లేదు. కేవలం చేగువేరా పుస్తకాలతో ఫోటోలకు పోజిచ్చాడు . పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక భాషా ప్రయుక్త పాఠశాలలు ఏర్పాటు చేసినా కొంతవరకైనా మాట నిలబెట్టుకొన్నట్టు అయ్యేది అదీ చేయలేదు .
ప్రభుత్వ పాఠశాలల్లో బీద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు అందుకు వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరల్చటానికి మాత్రమే ఈ కార్యక్రమం ప్రకటించాడని ఆనాడు పలువురు విశ్లేషకులు చెప్పిన మాట నిజమేనని ఇప్పుడు అనిపించక మానదు.