ఏ నాయకుడైనా రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతంతో పెడతారు. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా అడుగులు వేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటారు.. పరిపాలన చేపట్టాలనుకుంటారు. తమను నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు మార్గదర్శకంగా నిలవాలి అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో ఎప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి.. ఆఖరికి తనని నమ్మి వెంట నడిచే జనసేన కార్యకర్తలకు కూడా.
ఇక విషయానికొస్తే పార్టీ పెట్టి 10ఏళ్ళు అయినా రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాలేకపోయారు. 2014లో ఓట్లు చీలకూడదు అని చంద్రబాబు భజనలో తలమునకలయ్యారు. 2019 లోనైనా పోటీలో ఉండి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని బలంగా నమ్మిన సైనికుల ఆశల మీద నీళ్లు చల్లుతూ చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందానికి లొంగిపోయారు. పార్టీ అధ్యక్షుడుగా రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ, పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలవలేకపోయారు.
అయితే ఈ పొత్తుల పందేరంలో పవన్ కళ్యాణ్ విధానం, అతని వ్యక్తిత్వం తన పార్టీ సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకే, అపనమ్మకాన్ని కలిగిస్తూ వచ్చింది. దాని పర్యవసానం గత పదేళ్లుగా నెత్తిన పెట్టుకున్న జనసైనికులు కార్యకర్తలే తీవ్రంగా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అయితే ఇకపై ఎలాంటి పొత్తులు ఉండవు కచ్చితంగా మనం సింగల్ గా పోటీ చేస్తున్నాం 2024లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఇన్నిరోజూలు మభ్యపెడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్… బిజెపితో పొత్తు ముసుగులో టిడిపితో ఒప్పందం కుదుర్చడానికి బృహన్నల అవతారం ఎత్తారు. పొత్తులో ధర్మంగా తన వాటా సీట్లు రాబట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. పదేళ్లుగా తనని నమ్మిన నాయకులకు సీట్లు ఇప్పించుకోలేని స్థితిలో రోడ్డున నిలబెట్టారు.
ఈ క్రమంలోనే పదేళ్లుగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు జనసేన జెండా మీద టికెట్ లభిస్తుంది. కచ్చితంగా జనసేన పూర్తిస్థాయిలో పోటీలో ఉంటుంది అనుకున్న నాయకులకు నిరాశ మిగిలింది. టిడిపి జనసేన ఉమ్మడి పొత్తులో 50 నుండి 60 సీట్ల వరకు కేటాయింపు జరుగుతుంది అనుకున్న క్రమంలో 24 అసెంబ్లీ 3 ఎంపీలకు జనసేన పరిమితమైంది. అయితే అనూహ్యంగా బిజెపితో పొత్తు కుదరడంతో మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానంలో కోతబడి జనసేన 21 అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.
అయితే ఈ 21 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ని, జనసేన ని నమ్ముకున్న వారిలో అత్యదికశాతం మందికి అవకాశం దక్కలేదు. పైగా ఆ స్థానాల్లో జనసేనలో తమకు సీటు వస్తుంది అనుకున్న ప్రతి చోట టిడిపి బిజెపి జంపింగ్ జపాంగులను నిలబెడుతూ వచ్చారు. ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో అహర్నిశలు శ్రమించినటువంటి జనసేన నాయకులకు ఎవ్వరికీ అవకాశం లేకుండా పోయింది. ఒకరకంగా 10 ఏళ్ల తమ కష్టం శ్రమ ఆస్తులు అన్ని కోల్పోయి ఈరోజు జనసేనలో స్థానాలు దక్కక రోడ్డున పడినటువంటి పరిస్థితి.. ఏ జనసేన నాయకుడిని కదిలించినా కన్నీళ్ళ పర్యంతం అవడం తప్ప మరొకటి కనిపించడం లేదు.. కనీసం తనకు కేటాయించిన స్థానాల్లో కూడా తన వెంట నడిచిన నాయకులను జనసేన జెండా మీద నిలబెట్టుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉంది అంటే బాబుతో లాలూచీ రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం అవుతుంది.
అందుకే జనసేన విధానాలు, పవన్ కళ్యాణ్ బాబు బానిసత్వపు అడుగులు సహించలేని కొంతమంది జనసేనకు సంబంధించి ప్రాణం పెట్టి పని చేసిన వాళ్లలో అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు, ముమ్మిడివరం ఇంచార్జ్ పీతాని బాలకృష్ణ, కాకినాడ నగర మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, రాజోలు ఇంచార్జి బొంతు రాజేశ్వరరావు, పిఠాపురం మాకినీడు శేషుకుమారి, రామచంద్రాపురం పోలిశెట్టి చంద్రశేఖర్, రాజోలు బొంతు రాజేశ్వరరావు, జగ్గంపేట పాటంశెట్టి సూర్యచంద్ర… ఇలా అనేకమంది జనసేన నాయకులు రోడ్డున పడ్డారు.. ఇందులో కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడుతుంటే మరి కొంతమంది అధికార వైసీపీ పార్టీలోకి చేరటానికి అడుగులు ముందుకు వేస్తున్నారు.. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన ప్యాకేజీ రాజకీయాల కోసం పార్టీని పార్టీని నమ్ముకున్ననాయకుల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డును పడేసాడు అనేది మాత్రం ముమ్మాటికీ నిజం..