ఎలక్షన్స్ సందడి మొదలు అయింది. అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకొంటున్న వేళ ఏ పార్టీ సన్నద్ధత ఎలా ఉంది అని చూస్తే, అధికార వైసీపీ పార్టీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర మొదలు పెట్టారు, మొదటి రోజు భారీ జనసందోహం మద్య మొదలైన యాత్ర రెండవరోజుకి అంచనాలకి మించిన జనసందోహంతో తీర్ధ యాత్రలా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి .
ఇటు మూడు పార్టీల కూటమిలోని పెద్దన్న టీడీపీ కుప్పం నుండి మొదలు పెట్టిన మొదటి సభనే ప్లాప్ షో గా మిగిలింది. టీడీపీ అధినేత కొడుకు భావి టీడీపీ నాయకుడు ఎక్కడ వున్నారో తెలియదు.కూటమిలోని మిగిలిన పార్టీలు అయిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ టిక్కెట్లు ప్రకటించడమే అవ్వలేదు, ఇప్పట్లో ప్రచారం ఆలోచన కూడా లేనట్లు వుంది. వారాహి అడ్రెస్ తెలియట్లేదు . ఇక బిజెపి నాయకులు టికెట్ల గొడవలతోనే టైమ్ సరిపోతుంది, వాళ్ళకు ప్రచారం కంటే బాబుకు బంటులుగా టీడీపీ చుట్టూ తిరగడమే సరిపోతుంది.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అందరి కంటే ముందుగా టిక్కెట్లు ప్రకటించి తన నాయకులను, పార్టీ కార్యకర్తలను ఎలక్షన్ కు సిధ్ధం పేరుతో సిద్ధం చేసి వుంచారు . ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారు. ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో చేసిన మంచిని రాష్ట్రానికి చేసిన అభివృద్ది గురించి వివరిస్తూ రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఏమి చెయ్యాలో సలహాలు ఇవ్వండి అంటూ ప్రజల మధ్య కు వచ్చారు. దీనితో ప్రజల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వైఎస్సార్సీపీ పార్టీ మీద పాజిటివ్ వెవ్ క్రియేట్ అయ్యి పార్టీ అభ్యర్థులకు విజయం సులువు చేస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవంతం అయ్యి అది విజయా యాత్ర గా మారింది.
టీడీపీ , బిజెపి, జన సేన కలిసి మొదటి సభ చిలకలూరపేటలో సభ పెట్టారు అది అట్టార్ ప్లాప్ అవ్వడంతో పాటు మోడీ కి అవమానం చెయ్యడంతో అ మంటలు ఇప్పటికి ఆగడం లేదు . టీడీపీ ఒంటరిగా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి ప్రచారం మొదలు పెట్టి జగన్ ను తిట్టడంతోనే సరిపెట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు సభలు పెడితే ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాలేదు.
అటూ భావి నాయకుడు లోకేష్ మంగళగిరిలో రెండు మూడు రోజులు కేవలం గేటెడ్ కమ్యూనిటీల చుట్టూ తిరిగి మళ్లీ మాయం అయినారు. టీడీపీలో జరుగుతున్న టికెట్ గొడవలను పట్టించుకోవడం మానేశారు. దీనితో సగం నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంటిపోరు ఎక్కువై టికెట్ దక్కించుకొన్న అభ్యర్థులు ప్రచారం చేయలేని స్థితి.
ఇక జన సేన 21 సీట్లకు 18 ప్రకటించి వాటిల్లో 60% బయట పార్టీ నాయకులకు టికెట్ లు ఇవ్వడంతో ఇంటి పోరుతో తలబొప్పి కట్టి పార్టీని వదిలేశారు పవన్ కళ్యాణ్. చివరకు నేను గేలిస్తే చాలు అనుకుంటూ పిఠాపురం చుట్టూ తాను అలోచనలు చేస్తూ పార్టీ మొత్తాన్ని పిఠాపురం చుట్టు తిప్పుతున్నారు. బిజెపి గురించి ఎంత తక్కువ గా మాట్లాడుకుంటే అంత మంచిది . టీడీపీ కి బీ టీమ్ గా మారి అసలు బిజెపి, టీడీపీ బిజెపి గా విడిపోయి తగువులు పడుతూ కూర్చున్నారు.