బి కాంలో ఫిజిక్స్ అనగానే గుర్తొచ్చేంత పాపులర్ పొలిటిషియాన్ ఎవరు, రాష్ట్రంలో చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతారు జలీల్ ఖాన్ అని . ఓ ఇంటరవ్యూలో తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెబుతూ బి కాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుందని నోరు జారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రోలింగ్ కి గురయ్యాడు.
జలీల్ ఖాన్ నేపధ్యం చూస్తే 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన జలీల్ ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యిన విషయం విదితమే. 2019 లో జగన్ హవా ముందు ఓటమి చెందిన జలీల్ ఖాన్ ఆ తర్వాత చంద్రబాబు దూరం పెట్టడంతో గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బీజేపీతో జత కట్టునున్న పరిస్థితిలో తనకి టికెట్ ఇవ్వకుండా తన రాజకీయ జీవితానికి బాబు సమాధి కడుతున్నాడని గ్రహించాడో ఏమో తెలుగుదేశం పార్టీని వీడి మళ్ళీ వైఎస్ఆర్సీపీ లోకి రావడానికి ప్రయత్నాలు మమ్మురం చేశాడు . అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంఛార్జి , రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామి రెడ్డిని కలిశాడు.
విశేషం ఏంటంటే 2019 ఎన్నికల ముందు తన కుమార్తెని పులివెందులలో జగన్ పై పోటీకి నిలబెట్టి జగన్ ని ఓడిస్తా అని స్టేట్మెంట్ ఇచ్చిన జలీల్ రేపో మాపో జగన్ వద్దకు వెళితే ఆయన నవ్వుతూ ఈ ప్రశ్న అడిగితే పాపం అతని పరిస్థితి.