2014 ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరి పరిస్థితి ఇపుడు అగమ్యగోచరంగా ఉంది. ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప మిగిలిన వారందరూ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎదుటి వారిలో ఉండే సారాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసేసాక పక్కన పడేయడం అలవాటే అయిన చంద్రబాబు విధానం ఇపుడు వీరందరికీ మింగుడు పడట్లేదు.
వివరాల్లోకి వెళితే, వైసీపీ నుంచి టీడీపీలో చేరి, బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుంది అనే సమాధానంతో పాపులారయి ఇప్పటివరకూ నెట్టుకొచ్చిన జలీల్‌ఖాన్‌కి ఇక టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. దానితో అతను ఏకంగా… “టికెట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటాను” అని బెదిరించే స్థాయికి దిగిపోయారు.
మొన్నటివరకూ అనంతపురం నుంచి ఆయన కూతురు, విజయవాడ నుంచి ఆయననీ చంద్రబాబు తప్పకుండా పోటీలో పెడతారనీ, మళ్ళీ ఎన్నికలకి వెళ్ళొచ్చు అని కలలు కన్న ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. ఆయనకున్న మైనారిటీ బలం చేత చంద్రబాబు ఇప్పటివరకూ ఏదో విలువిచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు తప్ప… లేదంటే చంద్రబాబు రంగునీ, నిజస్వరూపాన్నీ ఆయన ఎప్పుడో చూసి ఉందురు. కనీసం, ఇప్పుడయినా నిజరూపం తెలిసిందని ఆనందపడాలి తప్ప, ఇంకా పార్టీని పట్టుకు వేలాడటంలో ఇంకా జలీల్ ఖాన్‌కి ఉపయోగం లేదు.