రామాయపట్నం పోర్ట్ మొదటి విడత పనులు చివరి ప్రక్రియకు చేరుకున్నాయి. త్వరలోనే ముగించుకొని ప్రారంభానికి నోచుకోవచ్చు.
నవ్యాంధ్ర ఏర్పడి దాదాపు దశాబ్దం కావొస్తోంది . మన రాష్ట్రానికి ఏమి కావాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి మనకు ఉన్న వనరులు ఏంటి దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి , ఎలాంటి పెట్టుబడులు పెడితే మన రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది అని ఆలోచనలు ను గత పాలకులు చేసి ఉంటే రాష్ట్ర పురోగతి లో నేటికీ ఒక అడుగు ముందు ఉండేవాళ్ళం. కానీ గత పాలకులు తమ పాలనను శిలాఫలకాలు, శంకుస్థాపనలతోనే ఆపేశారు. గత పాలకులు అభివృద్ధి విస్మరించి కాస్త వెనుకపడేలా చేసినా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు వున్న వనరులు ఏంటి, వాటిని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఆలోచనలు నుంచి పుట్టుకొని వచ్చిందే ఈ పోర్ట్ లు నిర్మాణం
మన చిన్నప్పుడు నుంచి పాఠ్యాంశాలలో చదువుకొని ఉండి ఉంటాం , 1956 లో ఆంధ్ర ఏర్పడిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీరా ప్రాంతం ఉంది అని, కానీ అప్పటినుంచి మనకి ఉన్న పోర్ట్ లు 5 . ఉన్న వాటికి అదనంగా మరో 4 నిర్మిస్తున్నారు,కొత్తగా నిర్మిస్తున్న 4 లో రామాయపట్నం పోర్ట్ మొదటిది.
ప్రస్తుతానికి వస్తే రామాయపట్నం పోర్ట్ తుది అంకానికి చేరుకున్న సందర్భం లో రామాయపట్నం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం.
2022 జూలై 20 న ఈ ప్రభుత్వం లో శంకుస్థాపన కి నోచుకోబడిన రామాయపట్నం పోర్ట్ రికార్డ్ స్థాయిలో 18 నెలల్లో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడనికి సిద్దంగా ఉంది. చిత్త శుద్ధి ఉంటే పనులు త్వరతగితిన అవుతాయి అన్నాడానికి ఇదే నిదర్శనం.
రామాయపట్నం పోర్ట్ తో చిరకాల కోరిక తీర్చుకోనున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు
ఎన్నో ఏళ్లుగా , అన్ని ప్రభుత్వాలు అదిగో పోర్ట్ ఇదిగో పోర్ట్ అంటూ ఊరిస్తూ ఊరిస్తూ ఉన్న రామాయపట్నం పోర్ట్ ఎట్టకేలకు మొదటి బెర్త్ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది.
చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ కు రామాయపట్నం పోర్ట్ ఒక అదనపు బలం.
మల్టీ కార్గో ఆపరేషనల్ పోర్ట్ గా అభివృద్ధి కానున్న రామాయపట్నం పోర్ట్, ఇప్పటికే మొదటి బెర్త్ పనులు పూర్తి కాగా , పోర్ట్ కు అనుకునే NH16 జాతీయ రహదారి, దానికి అనుకునే కార్గో ఆపరేషనల్ దృష్ట్యా కార్గో విమానశ్రయము నిర్మాణ కొరుకు అడుగులు పడుతున్నాయి.
ఒక వైపు పోర్ట్ పనులు జరుగుతున్నాయి , మరో వైపు ప్రభుత్వం 8000 ఎకరాల భూసేకరణ చేపట్టి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కొరుకు పనులని వేగవంతం చేసింది. లోకల్ గా ఉన్న ప్రజలకి మేలు చేకూర్చేలా ఉద్యోగ కల్పన లో 70 శాతం స్థానికులు కు 30 శాతం నాన్ లోకల్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.