మహిళలంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు చిన్నచూపు ఉందని మరోసారి రుజువైంది. కమలం పెద్దల మెప్పు కోసం పెద్ద హిందువునని బిల్డప్ ఇస్తుంటాడు. అదే సమయంలో ఆయన వివాహాల అంశం తెరపైకి వచ్చి ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో బయటపడుతుంది.
ఆడవారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించనని పవన్ నిత్యం చెబుతుంటారు. కానీ చేసే పనులు మాత్రం వేరుగా ఉంటాయి. సేనానికి పెద్ద భజన బ్యాచ్ ఉంది. వారు చిల్లర చేష్టలు చేస్తున్నా పట్టింకోకుండా తనను పొగిడితే చాలని అనుకుంటుంటాడు. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా జబర్దస్ ఆర్టిస్టులను నియమించుకుంది. వీరిలో చాలామంది తమ స్కిట్లలో ఆడవారిని చులకనగా మాట్లాడినవారే. కానీ పవన్‌కు ఇలాంటి వారే కావాల్సి వచ్చారు.
హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తదితరులు పవన్ తరఫున ప్రచారానికి దిగారు. వీరంతా కొన్ని వందల స్కిట్లలో ఆడవారి గురించి ఎంతో అసభ్యంగా డైలాగ్‌లు చెప్పారు. హాస్యం పేరుతో డబుల్ మీనింగ్ మాటలు చెప్పడంలో దిట్టగా పేరొందారు. తనకు మహిళలంటే ఎంతో గౌరవమని చెప్పే సేనాని వీరి చేత ప్రచారం చేయించుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆది నోటికి అడ్డే ఉండదు. ఆడవారంటే ఇతనికి ఎంతమాత్రం గౌరవం లేదని స్కిట్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ స్టార్ క్యాంపెయినర్‌గా పెట్టి తన భజన చేయించుకుంటున్నాడు సేనాని.
వివాహ వ్యవస్థపై, మహిళల రోజువారీ ఇంటి కార్యకలాపాలపై, ప్రేమ బంధంపై, ఉద్యోగ జీవితం.. తదితర అంశాలపై జబర్దస్త్‌లో చాలా దారుణమైన కార్యక్రమాలు వచ్చాయి. సరదా నవ్వించడానికే చేస్తున్నామని వారంతా సమర్థించుకోవచ్చు. కానీ ఆరోగ్యకరమైన సమాజానికి ఆ స్కిట్లు ఏ మాత్రం మంచిది కాదు. కానీ ఈనాయుడు రామోజీరావు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అవి చేసిన వారు ఇప్పుడు పవన్‌ను గెలిపించాలంటూ ప్రజల్లోకి వచ్చారు. మహిళలే సేన గ్యాంగ్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే డబ్బు యావలో వారు మరిన్ని నీచమైన కార్యక్రమాలు చేసే ప్రమాదముంది.