తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీకి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై ఏపీ బీజేపీ నాయకులు భగ్గుమంటోన్నారు. ఏపీ బీజేపీలో సీనియర్ నాయకులను విస్మరించి టీడీపీ నుంచి నాయకులు తెచ్చుకొని బీజేపీ తరఫున పోటీ చేయించాల్సిన అవసరం ఏముందని బహిరంగనే ప్రశ్నిస్తున్నారు.
అనపర్తి సీటు నుంచి మొదట బీజేపీ నుంచి కృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ నాయకుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృష్ణంరాజు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుబట్టడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్లాన్ వేసి కూటమిలో భాగంగా ఆ సీట్ ని ఇప్పటికే బీజేపీకి కేటాయించడంతో రామకృష్ణారెడ్డిని బీజేపీలో జాయిన్ కావాలని ఆ పార్టీ తరఫున సీట్ వచ్చేలా తాను చూస్తానని హామీ ఇచ్చాడు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వ్యవహరిస్తోంది. తన ప్రచార రథం పైన రాజమండ్రి అసెంబ్లీ పరిధిలో పోటీ చేసే నాయకుల స్థానంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డికి సీటు ఖరారు కానప్పటికీ ఆయన ఫోటోను తన ప్రచార వాహనంపై వేసుకొని తిరుగుతుంది. ఈరోజుకి కూడా రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కాలేదు
దీనిపై ఏపీ బీజేపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. పార్టీ వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలు, సీట్లు- అభ్యర్థుల ఎంపికను తప్పుపట్టిన కృష్ణారావు, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏపీ బీజేపీ మనుగడ సాగించలేదని తేల్చి చెప్పారు. ఏపీలో బీజేపీ దిశ దశ లేకుండా సాగుతోందనడానికి అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంపిక ఉదాహరణగా అభివర్ణించారు.