చంద్రబాబు నాయుడు గారు బాగా అనుసరించే పద్ధతుల్లో ముఖ్యమైనది తస్మదీయులు, మనకి ఉపయోగపడేవారిని గుర్తించి, వారికి అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉండటం. కొందరి విషయంలో ఒక్కసారి పని అయిపోయాక వారి మొహం కూడా చూడరు అన్నది వేరే విషయం అనుకోండి.
కానీ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలకి వీర విధేయుడిగా ఉంటూ వారి అవసరాలన్నీ తూచా తప్పకుండా నేరవేరుస్తాడు బాబు, వారిలో మరీ ముఖ్యడు రామోజీ రావన్నది జగద్విదితం . ఈ బంధం ఎక్కడ మొదలైంది. బాబు రామోజికి అధికారికంగా చేకూర్చిన తొలి లబ్ది ఏంటో చూద్దామా.
1995 సంవత్సరంలో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను టెలికాస్ట్ చేయడానికి రామోజికి చెందిన ఈటీవీకి సుమారు తొంభై లక్షల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టారని మీకు తెలుసా?
అది కూడా ఈటివి కన్నా తక్కువ ధరకే లైవ్ ప్రసారం చేస్తామని కోట్ చేసిన జెమిని టీవీని కాదని భారీ మొత్తం డిమాండ్ చేసిన ఈటీవీ కే ఎందుకు కట్టబెట్టారు అన్న దానికి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి సమాధానం “ఈటీవీకి మిగతా టీవీల కన్నా ఎక్కువగా ప్రజాదరణ ఉండటం వల్ల” అట.
1995 లో ఈటీవీ కన్నా ముందొచ్చిన జెమీనీ టీవీకి ప్రజాదరణ ఎంతుండేదో అప్పటివారికి అందరికీ తెలుసు. మరి ఈటీవీకి ఎలా ఎక్కువ ప్రజాదరణ లభించింది???.
దీని వెనుక మతలబు ఒకటే, ఈటీవీకి చంద్రాదరణ, చంద్ర ఆరాధన ఎక్కువ. దానితో అన్నిరకాల కాంట్రాక్టులు గుంపు గుత్తగా రామోజీ దగ్గరికి తరలివెళ్లిపోయేవి. వెన్నుపోటును నిశ్శబ్ద యుద్ధంగా తన పేపరులో చిత్రీకరించినందుకు.. రామోజీకి లభించిన తాయిలాలో ఇది ఒకటి.