నవధాన్యాలు పండించి వాటిని ఇంటికి చేర్చి రైతులు కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునే మొదటి పండగ మకర సంక్రాంతి , ఈ ఏడాది మాత్రం రైతులతో పాటు నవ్యాంధ్రలో పోర్టులు నిర్మాణాలు, కొత్త విమానాశ్రయాలు, భారీ పరశ్రమలు, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు నిర్మాణాలు, ఫిషింగ్ హార్బర్ లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లుతో నవ్యాంధ్ర పారిశ్రామిక సంక్రాంతిని కూడా జరుపుకుంటోంది.
ఇండస్ట్రీస్ పురోగతిలో, ఉద్యోగ కల్పన లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లలో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్. ఒక వైపు సంక్షేమం ,మరో వైపు ఉన్న వనరులు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ది పథం వైపు వేగంగా నడుపుతున్నారు జగన్ అని చెప్పవచ్చు .
గత 4 సంవత్సరాలలో రాష్ట్రానికి వచ్చిన 311 భారీ కంపెనీల ద్వారా లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు కల్పన జరగగా, 2022 డిసెంబర్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో 386 MOU లా ద్వారా 13.11 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 6 లక్షల 7 వేల ఉద్యోగాల కల్పన కు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ద్వారా 30 వేల కోట్ల పెట్టుబడితో తో 3.94 లక్షల పరిశ్రమల ద్వారా 26.29 లక్షల మందికి ఉపాధి అవకాశం దొరికింది, చిన్న మధ్య తరగతి పరిశ్రమలని పర్యవేక్షించడానికి 54 క్లస్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నష్టాలలో ఉన్న చిన్న మధ్య తరగతి పరిశ్రమలుకు సహాయం చేయడానికి 2087 కోట్లు సహాయం అందచేసింది.
రామాయపట్నం , మచిలీపట్నం , మూలపేట, కాకినాడ గేట్ వే పోర్ట్ లు ద్వారా మన నవ్యాంధ్రకు ఉన్న తీర ప్రాంత సంపదను సద్వినియోగం చూసుకునేలా 16 వేలు కోట్ల వ్యయంతో 4 పోర్టులు నిర్మాణం తో 110 మిలియన్ టన్నులు కార్గో హ్యాండ్లింగ్ ద్వారా 75000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి .
4000 కోట్లతో పెట్టుబడితో మత్స్యకారులు కోసం ఫిషింగ్ హార్బర్ , ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ద్వారా మన ఆంధ్ర తీరా ప్రాంత ప్రతి 50 కిలోమీటర్లు అంతర్జాతీయ ప్రమాణాలు తో పది ఫిషింగ్ హార్బర్ లు , ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తద్వారా మత్స్య సంపద వ్యాపారన్ని పెంచుకొని రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటు అవుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది.
అలాగే 3200 కోట్ల తో భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ కు శ్రీకారం చుట్టి పనులు వేగవంతం గా జరుగుతున్నాయి, కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో రాష్ట్ర పురోగతి సాధిస్తుంది దీని ద్వారా 90000 వేలు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి.కొత్త ఎయిర్పోర్ట్ తో పాటు ఇప్పటికే ఉన్న గన్నవరం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌లను మరింత అభివృద్ది చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు అడుగులు వేస్తుంది .
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత 3 సంవత్సరాలగా దేశం లో నెంబర్ 1 స్థానం లో ఉంది. GSDP గ్రోత్ రేట్ లో ఆంధ్ర మొదటి స్థానం లో ఉంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి భజనకాస్, బంగూర్స్, సింఘ్వీస్,
జిందాల్, బిర్లా, టాటా గ్రూప్, JSW స్టీల్, రాంకో సిమెంట్
సెంచరీ ప్యానెల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్
Dixon టెక్నాలజీస్, Greenlam సౌత్, లారస్ లాబ్స్
ఇన్ఫోసిస్ విప్రో వంటి పెద్ద కంపెనీలు ఏపీ బాట పట్టాయి .
నవ్యాంధ్ర పారిశ్రామిక అభివృద్ది పథం లో నడుస్తుంది అనే దానికి ఇదే నిదర్శనం.
పెద్ద చిన్న మధ్య తరిగితి పరిశ్రమలు రెండు కలుపుకొని 14.19 లక్షల కోట్ల పెట్టుబడితో 33.63 లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయి లో అభివృద్ది లో ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి లేదు.
ఇది మాటలు ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని జగన్ నిరూపించాడు.