Home »andhra pradesh » Is The Tdp Born And Drowned With The Announcement Of Seats
సీట్ల ప్రకటనతో టీడీపీ పుట్టి మునిగిందా?
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం కళ్యాణదుర్గానికి కూడా పాకింది. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమలినేని సురేంద్రబాబు పేరును ప్రకటించడంతో ఉన్నం వర్గం వారు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.
తెలుగుదేశం జనసేన అభ్యర్ధులు ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు .. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ రాని అసమ్మతి వర్గం నాయకులు ఆ పార్టీ అధినాయకత్వంపై భగ్గుమంటున్నారు. తమ చేత ముందునుండి డబ్బుని నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టించి చివరికి డబ్బు బలంగా ఉన్న వారికి సీట్లు అమ్ముకున్నారనే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం కళ్యాణదుర్గానికి కూడా పాకింది. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమలినేని సురేంద్రబాబు పేరును ప్రకటించడంతో ఉన్నం వర్గం వారు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇన్నిరోజులు టీడీపీని నమ్ముకుంటే ఇలా వెన్నుపోటు పొడుస్తారా అంటూ ఆవేదన చెందుతున్నారు. తాజాగా చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి తమ నిరసనను తెలియజేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ జనసేన సీట్ల ప్రకటన వల్ల ఏర్పడుతున్న అసమ్మతి జ్వాలల్లో ఆ పార్టీ పుట్టి మునిగేలా ఉందనే వాదన రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంది.