వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వలన రాష్ట్రం శ్రీలంక, జింబాబ్వే, సూడాన్ దేశాల లాగా తయారు అవుతుందని చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎగతాళి చేయడం మనందరికీ తెలిసిన విషయమే .
అయితే ఎన్నికల వేల బాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని పధకాలకు ఎంత మొత్తం అవుతుందో లెక్కలతో సహా వివరించారు ఏపీ సీఎం జగన్ . ఆ లెక్క ప్రకారం చూస్తే బాబు మినీ మేనిఫెస్టోలోని పధకాలు మొత్తానికి కలిపి ఏడాదికి 73440 కోట్ల వ్యయం అవుతుంది. ఇహ ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా అమలు చేయాల్సిన మిడ్ డే మీల్, ఫీ రీ ఎంబర్స్మెంట్, పెన్షన్ వంటి తప్పనిసరి పధకాలకు ఏటా 52700 కోట్ల వ్యయం అవుతుంది.
నాకు అధికారమిస్తే ఏ ఒక్క పధకాన్ని తొలగించను అంతకుమించి ఇస్తాను అన్న చంద్రబాబు మాట ప్రకారం రెండూ కలిపి 126140 కోట్లు అవుతుంది. గతంలో 52700 కోట్ల పధకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక, సూడాన్ అవుతుందన్న బాబు ఇప్పుడు రాష్ట్ర ఆదాయ పరిమితిని మించి 126 వేల కోట్లు ఇస్తే శ్రీలంక కాకుండా సింగపూర్ అవుతుందా .
గతంలో వైసీపీ అమలు చేస్తున్న అమ్మవడి పధకం ద్వారా ఇచ్చే డబ్బులతో నాన్నలు తాగుతున్నారు అంటూ అమ్మవడి నాన్న బుడ్డి అంటూ హేళన చేసిన బాబు ఇప్పుడు అదే పధకం పేరు మార్చి అమ్మకి వందనం అని పెడితే ఇప్పుడు నాన్నలు బుడ్లు పట్టుకొని తాగకుండా వందనాలు చేస్తారా.