సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ. 22302 కోట్లతో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది.
JSW సంస్థ ఏర్పాటు చేయనున్న 3350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూ.12065 కోట్లు పెట్టుబడి పెట్టనుండగ తద్వారా 3300 మందికి ఉపాధి అవకాశాల లభించనున్నాయి. JSW ఏర్పాటు చేసే కేంద్రాలు వైఎస్ఆర్ జిల్లా లో చక్రాయపేట దగ్గర 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ దగ్గర 1050 మెగావాట్లు , అనంతపురం జిల్లా లో కనగాన పల్లి, రాప్తాడుల్లో కలిపి 1050 మెగావాట్లు , డీ.హీరీహాల్, బొమ్మనాహల్ లో కలిపి 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
సత్యసాయి జిల్లా తలుపుల మండలం లో పులిగుండ్ల పల్లె వద్ద అగ్వాగ్రీన్ ఇంజనీరింగ్ అనే సంస్థ 4 వేల కోట్ల పెట్టుబడితో 1000 మెగా వాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తద్వారా 1000 మందికి ఉపాధి అవకాశం లభించనుంది.
JSW సంస్థ నంద్యాల జిల్లా లోని అవుకు మండలం కనుకుంట్ల , కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం దగ్గర రూ . 1287 కోట్ల పెట్టుబడితో 171.60 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ కు అనుమతి లభించింది తద్వారా 200 మందికి అక్కడ ఉపాధి అవకాశాల లభించనున్నాయి.
కర్నూల్ జిల్లా అస్పిరి దగ్గరలో ఎక్రాస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1350 కోట్ల పెట్టుబడితో 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతి లభించింది తద్వారా 200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెన్యూవిక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.3600 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్లా పవన విద్యుత్ కేంద్రానికి అనుమతి లభించింది, తద్వారా 600 మందికి ఉపాధి అవకాశం లభించనుంది.