ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు భవితవ్యం రేపు తేలనుంది. రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలు ఎప్పుడు విడుదల చేసేది తెలిపింది.
ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఏప్రిల్ 12న పరీక్షా ఫలితాలు విడుదల అవుతాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే నిజం చేస్తూ తాజాగా ఇంటర్ ఫలితాల తేదీని ప్రకటించడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) రాష్ట్రంలోని వివిధ కేంద్రాలలో పరీక్షలను నిర్వహించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రెండూ ఒకేసారి రోజువారీ షిఫ్ట్‌లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. మార్చి నెలలో పరీక్షలు జరగగా , మొదట పరీక్ష జరిగిన వెంటనే ప్రభుత్వం మూల్యాంకనం మొదలు పెట్టింది. ఫలితాలు అనంతరం ఇంప్రూవ్మెంట్, ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు తేదీల ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తాం అని ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.