తెలుగుదేశం పార్టీ కంచుకోటైన ఉండి అసెంబ్లీ సీటుకు ఈసారి గండిపడేలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఒక్క 2004 తప్ప అన్ని ఎన్నికల్లో టిడిపినే గెలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకి సీటు నిరాకరించారు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకి సీటు కేటాయించడం జరిగింది.
2009,2014 ఎన్నికల్లో గెలిచిన శివరామరాజును 2019 సార్వత్రిక ఎన్నికలకు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయమని అధిష్టానం ఆదేశించింది. టిడిపి అధిష్టానాన్ని కాదనలేక శివరామరాజు నర్సాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి అయిన రఘురామకృష్ణ రాజు చేతిలో ఓటమి పాలు చెందాడు. 2019లో చంద్రబాబు మాట విని శివరామరాజు తనకు తాను రాజకీయ సమాధి చేసుకున్నాడు. 2019 లో పార్లమెంట్ సీట్ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యే సీట్ నీకే కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాటను నమ్మిన శివరామరాజు తన సొంత నియోజకవర్గమైన ఉండిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు తన అసలు రూపాన్ని బయటపెట్టి శివరామరాజుకి టికెట్ కేటాయించకుండా ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కేటాయించాడు. దీంతో ఇక్కడ టిడిపి రెండు వర్గాలు అయ్యాయి. శివరామరాజు ఇదివరకే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను రామరాజుకి సపోర్ట్ చేయనని ప్రకటించాడు.
రామరాజుకి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో రామరాజు చురుగ్గా నియోజకవర్గస్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్న సమయంలో కూటమి తరపున నరసాపురం పార్లమెంట్ సీట్ ను ఆశించిన రఘురామ కృష్ణంరాజుకు నిరాశ ఎదురయింది. కూటమి తరపున ఆ సీట్ నుంచి బిజెపి తరపున శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నడు.. రఘురామకి ఆ సీటు దక్కకపోయేసరికి తన కళ్ళు ఉండి నియోజకవర్గం మీదికి పడ్డాయి. అనుకున్నదే తడవుగా వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు. ప్రస్తుత ఎమ్మెల్యే ముందు ఈ ప్రకటన చేయడంతో ఆశ్చర్యపోవడం రామరాజు వంతు అయింది. రఘురామ పేరు ప్రకటన తర్వాత రామరాజు అనుచరులు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించడంతో రామరాజుని బుజ్జగించాలని ప్రయత్నించిన చంద్రబాబుకు నిరాశ ఎదురయింది. చంద్రబాబు నాయుడు సీట్ ఎవరికి ఇస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీగా చెప్పలేదు. అంతలోనే రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గ పరిధిలో ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఈనెల 22వ తేదీ నామినేషన్ వేస్తానని ప్రకటించాడు. రామరాజు నిన్న తన అనుచరులతో 22వ తారీకు టిడిపి తరఫున నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా టిడిపి పార్టీకి చెందిన వారే ముగ్గురు గొడవ పడుతున్న సందర్భంలో ప్రస్తుత అధికార పార్టీకి ఏమాత్రం కలిసొస్తుందో మరో నెల రోజుల్లో తేలిపోనుంది.