రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పతుల్లో సౌకర్యాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంది. నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసింది. జిల్లా ఆస్పత్రుల రూపురేఖలు మార్చింది. వైద్య సిబ్బంది నియామకం జరిగింది. దీంతో వాటిల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. గత సర్కారు హయాంలో హాస్పిటళ్లను పట్టించుకోలేదు. వసతులు దారుణంగా ఉండేవి. దీంతో 30 నుంచి 35 శాతమే జరగ్గా వైఎస్సార్సీపీ పాలనలో 46 శాతానికి చేరింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది గర్భిణుల వివరాలు సేకరించి వారు ప్రతినెలా 9వ తేదీన ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకున్నారు. హైరిస్క్ వారికి జిల్లా కేంద్రానికి రెఫర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగాSగర్భిణులు ఆస్పత్రుల్లోనే పిల్లలకు జన్మనిచ్చేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం 99.97 శాతం ప్రసవాలు హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రణాళిక ఫలితంగా మాతాశిశు మరణాలకు అడ్డుపడుతోంది. గర్భిణిగా రిజిస్టర్ అయిన మహిళలకు ప్రభుత్వం వైద్యసేవలు అందిస్తోంది. పౌష్టికాహారం ఇస్తోంది. అవసరమైతే ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించింది.