ఎక్కడైనా అధికార పార్టీలో విభేదాలు ఉంటాయి ఆంధ్రాలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీలో విభేదాలు తార స్థాయికి వెళ్ళపోయాయి . పార్టీ నుంచి ఒకొక సీనియర్ నేత టీడీపీ జెండాను పీకేస్తున్నారు. తమకు బలమైన జిల్లాలుగా చెప్పుకునే ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 40 సంవత్సరాల చరిత్ర గల టీడీపీ పార్టీ అంతిమ దశకు చేరుకుంటుందా అనే ప్రశ్న టీడీపీ వర్గాలలోనే ముమ్మరంగా ప్రచారంలో ఉన్నాయి.
టిడిపిలో పుట్టిన ముసలం కేశినేని నానితో మొదలై రాయపాటి రంగారావుతో కొనసాగుతూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వరకు వచ్చింది. త్వరలో టీడీపీ వ్యస్థాపక సభ్యుల్లో ఒక్కరైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసిన ఆశ్చర్య పోనక్కరలేదు. కేశినేని నాని తన కేశినేని భవనంపై ఉన్న టీడీపీ జండాలను పీకి పడేసి ఏకంగా చెత్త కుప్పలో పడేసారు. రాయపాటి రంగారావు ఏకంగా చంద్రబాబు ఫోటోను నెలకు వేసి పగలగొట్టారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన కార్యాలయం నుంచి చంద్రబాబు ఫ్లెక్సీలు, పోస్టుర్లు , టిడిపి జెండాలు బహిరంగంగానే పీకేసాడు. సందర్భానుసారం ఒకోరు ఒకసారి తమ ఆవేదనను ఇలా వెళ్లగక్కుతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికలో టీడీపీ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగ గెలిచిన కేశినేని నాని 2019 దాకా ఆ పార్టీలో బాగానే ఉన్నారు, 2019 టీడీపీ పార్టీ ఘోర పరాజయంలో కూడా గెలిచిన ముగ్గరు టీడీపీ ఎంపీలలో కేశినేని ఒకరు, 2019 నుంచి కేశినేని నాని టీడీపీ పార్టీ విధానాలు నచ్చక కొన్ని సార్లు బహిర్గంగా విమర్శలు చేసినా చంద్రబాబు అరెస్ట్ సమయంలో బాబుకు బెయిల్ రావడానికి కీలకంగా వ్యవహరించారు. అయినా అప్పటికే కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని దెగ్గర డబ్బు తీసుకున్న నారా లోకేష్ , కేశినేని చిన్నికి పార్లమెంట్ సీట్ కంఫర్మ్ చేసాడు దింతో కోపోద్రిక్తుడు అయినా కేశినేని నాని వైస్సార్సీపీ పార్టీ లో జాయిన్ అయ్యి విజయవాడ పార్లమెంట్ స్థానంలో పొటి చేస్తున్నాడు. విజయవాడ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సీట్లు వైస్సార్సీపీ అభ్యర్థులు గెలిచేటట్లు చేస్తానని ప్రకటన చేసాడు. వైస్సార్సీపీ అభ్యర్థులతో ససమన్వయం చేసుకుంటూ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నాడు.
టీడీపీకి పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక దిక్కుమాలిన పార్టీ , టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని ఆరోపించారు .తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీనేనని మండిపడ్డారు. గత ఎన్నికల్లో 150 కోట్లు తమ నుంచి తీసుకున్నారన్నారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నారో తమ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. అంతేగాక, మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా? అని నిలదీశారు. సవాల్ చేసి చెబుతున్నా. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానని స్పష్టం చేశారు.టీడీపీ పార్టీనే నమ్ముకొని ఎన్ని రోజులుగా లోపల జరుగుతున్న అవమానాలు లెక్క చేయకుండా అక్కడే ఉన్న నాయకులు ఒకరికొకరు ఇలా బయటికి వచ్చి తమకు టీడీపీ పార్టీ లో జరిగిన అన్యాయంను , అవమానాన్ని ఆవేదన రూపంలో తేలియాజేస్తున్నారు.
సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ కష్టకాలంలో టీడీపీ పార్టీనీ బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేసాడు. 2014 నుంచి నూజివీడులో చిన్నాభిన్నమైన పార్టీనీ ఒకే తాటి పైకి తెచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని, నూజివీడులో టీడీపీ పార్టీ కార్యలయంను సొంత డబ్బుతో కట్టిస్తే తనకు ఇచ్చే గౌరవం ఇదా? చంద్రబాబును నమ్ముకొని ఉంటే తనకు అన్యాయం చేసాడు అని మీడియా ముఖంగా తెలిపారు. నూజివీడు టికెట్ తనదేనంటూ చంద్రబాబు రెండుసార్లు తనకు హామీ ఇచ్చారని, 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి అనివార్య కారణాలు అనే పేరుతో తనను తప్పించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ పార్టీ కండువాను కప్పుకోని వైసీపీ నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. దీనికి నిరసనగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంకటేశ్వరరావు. దానికి కొనసాగింపుగా తన పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ జెండాలు, ఫోటోలను తొలిగించారు.
గుంటూరు నుంచి టిడిపి ఎంపీగా గెలిచిన గళ్ళ జయదేవ్ కూడా రాజకీయాలు నుంచి స్వస్తి పలకుతనాని ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఆయనను ఆపలేకపోవడం కచ్చితంగా టీడీపీ చంద్రబాబు వైఫల్యంగానే చూడాలి. ఇలా టీడీపీ పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకుల పరిస్థితే ఇలా ఉంటే ఇక టీడీపీ పార్టీ భవిష్యత్తు చంద్రబాబు చేతిలో అంతిమ దశకు చేరుకున్నట్టే అని ఆ పార్టీ నాయకులూ నుంచి వస్తున్న మాట. చంద్రబాబు ఇంత పతన అవస్థకు చేరుకోవడం తన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారి అవ్వడం గమన్హారం.