శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, డా.భగవత్ కిషన్రావ్ కరాడ్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ.. NACIN అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక అపెక్స్ ఇన్స్టిట్యూట్, ఇది పరోక్ష పన్నుల రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించడం, కస్టమ్స్, డ్రగ్ చట్టాలు మరియు పర్యావరణ పరిరక్షణలో వివిధ దేశాల అధికారులకు శిక్షణను అందిస్తుంది. అలాంటి వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అవుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబాటు జిల్లాల్లో ఒకటైనా అనంతపురం జిల్లాలో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇనిస్టిట్యూట్ ను తీసుకువచ్చేందుకు సహాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు..