‘నమ్ముకున్న వాళ్లకి భలే అన్యాయం చేశావ్ పవన్ కళ్యాణ్ అన్నా.. చాలామంది జనసైనికులు నీకు పైకి చెప్పకపోయినా.. చంద్రబాబు ట్రాప్‌లో పడి మనోళ్లని బాగానే ముంచేశావ్. నాదెండ్ల అనే ఒక కమ్మని అనుబంధంతో ముంచేయి మమ్మల్ని. అయినా మాకు మొహం మీద ఊసినా సిగ్గు రాదులే.. కానీ.. నీకో నమస్కారం’ సందీప్ పంచకర్ల విషయంలో ఓ జనసైనికుడి ట్వీట్ ఇది.
‘పవన్ అన్నా.. జగన్ మీద ఉన్న కోపంతో నాదెండ్లను నమ్ముకుని జనసేనను నాశనం చేస్తున్నావ్ కదా.. నిన్ను నమ్ముకొన్న నాయకులకే న్యాయం చేయలేకపోయావ్. ఇక ప్రజలకు కార్యకర్తలకు ఏం చేస్తావ్.. రాజకీయాలు వద్దు.. సినిమా ముద్దు..’ అంటూ ఓ జనసైనికుడు ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పవన్ అభిమాని ఒకరు ‘2019లో టికెట్లు ఇస్తే గెలవలేదు. ఒక్కసారి కూడా ఇవ్వకుంటే అనాలి’ అన్నాడు. దీనికి అసలు ట్వీట్ చేసిన వ్యక్తి ‘ఒక్కసారి ఓడిపోయారని టికెట్లు ఇవ్వరా.. నీ ప్రకారం ముందు పవనన్నే పక్కన కూర్చోవాలి’ అని జవాబిచ్చాడు. అభిమానులతో ఆడుకోవడం పవన్‌కు కొత్త కాదు. వారు ఆయన్ను గుడ్డిగా నమ్మడంతో ఏం చేసినా చెల్లుబాటవుతోంది. సేనాని టీడీపీ చెప్పినట్లు నడుచుకుంటున్నాడని స్పష్టంగా కనిపిస్తున్నా అదేమీ లేదని బుకాస్తారు. కానీ టికెట్ల విషయంలో వ్యవహరించిన తీరు చూసి కొందరి సైనికుల కళ్లు తెరుకున్నాయి.
భీమిలిలో సందీప్, విజయవాడ పశ్చిమలో పోతిన మహేష్‌కు పవన్ కళ్యాణ్ టికెట్లు ఎగ్గొట్టడంతో సోషల్ మీడియాలో జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత వ్యవహారశైలిని ఎండగడుతున్నారు. గంటా మెగా కుటుంబానికి బాగా సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు ఆయన్ను చీపురుపల్లి వెళ్లాలని చెప్పినా వినలేదు. వాస్తవానికి భీమిలి సీటు జనసేనదేనని అందరూ భావించారు. సందీప్ పోటీ చేయడం ఖాయమనుకున్నారు. కానీ పవన్‌కు గంటాకు మధ్య స్నేహం ఉండడంతో కాదనలేకపోయాడు. సందీప్‌ను నిండా ముంచేశాడు. దీంతో సోషల్ మీడియాలో జనసైనికులు పార్టీని తిడుతూ పోస్టులు పెడుతున్నారు.
విజయవాడ పశ్చిమ సీటును పోతిన మహేష్ ఆశించారు. చివరి వరకు ప్రయత్నించారు. కానీ పవన్.. చంద్రబాబు సన్నిహితుడైన సుజనా చౌదరికి ఇచ్చేశారు. దీంతో సేనాని నోరు మెదపడం లేదు. తనను నమ్ముకుని వారికి అన్యాయం జరుగుతోందని తెలిసినా ప్యాకేజీ కోసం సైలెంట్‌గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చాలామంది జనసైనికులు తమ అధినేతను అతిగా ఊహించుకున్నారు. వారి దృష్టిలో ఆయనంత మంచివాడు లేడు. కానీ వాస్తవం వేరు. పవన్ చంద్రబాబు మనిషి. ఆయన ఏమి చెబితే అదే చేస్తారు. ఈ విషయం అభిమానగణానికి పూర్తిగా అర్థమయ్యేలోపు ఒకప్పుడు సేన అనే పార్టీ ఉందని చెప్పుకొనే రోజులు వచ్చేసి ఉంటాయి.