సీఎం జగన్ ప్రజలతో మమేకం అయ్యేందుకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలంతా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా గురువారం నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరు జాతీయ రహదారి సమీపంలో జరిగిన మేమంతా సిద్దం సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పేద దళిత కుటుంబంలో పుట్టిన తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి మూడోసారి పోటీలో నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వలలు, మగ్గాలు, మేకలో ఇచ్చి మిమ్మల్ని ఉద్దరించామని చెప్పుకునే ఎందరో పాలకులను చూశామని అదేవిధంగా ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అన్న పెత్తందారి వ్యవస్థకు మూల పురుషుడు చంద్రబాబును కూడా చూశామని కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే మీ చేతుల్లో ఉండాల్సినది పనిముట్లు కాదు రాజ్యాధికారమని ఆయా వర్గాల వారిని డిప్యూటీ సీఎంలు, మంత్రులను చేసి సామాజిక సాధికారత కల్పించిన ఏకైక నాయకుడని ఎమ్మెల్యే వెల్లడించారు. మేమంతా సిద్ధంకు విచ్చేసిన జగనన్నను ఆశీర్వదించేందుకు వేలాదిగా ప్రజలు రావడం సంతోషంగా ఉందని, జగనన్న పిలుపు ఓ ప్రభంజమని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు ఆలయ ప్రవేశంలేని సామాజిక వర్గానికి చెందిన తనకు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యులుగా స్థానం కల్పించిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని, జగనన్న పాలనలో సామాజిక న్యాయానికి ప్రత్యక్ష ఉదాహరణ తానే అని పేర్కొన్న ఎమ్మెల్యే సంజీవయ్య సూళ్లూరుపేట నియోజకవర్గంలో రూ 2400 కోట్లతో డీబీటీ, నాన్ డీబీటీ సంక్షేమ పథకాలు అందించామని రూ 1400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. వంచన చేసే చంద్రబాబు పార్టీకి శాశ్వత సమాధికట్టి మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుందామని ప్రజలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అభ్యర్ధించారు.