సిద్దం సభలకు వచ్చిన అశేష జనవాహిని చూసి గుండె తరుక్కుపోయి, ఎలా సర్దుకోవాలో తెలియక అవన్నీ గ్రాఫిక్స్ అనీ, అసలు సభలో జనాలే లేరని తమ తమ పేపర్ లలో మెయిన్ ఎడిషన్ లో మొదటి పేజి లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఎల్లో మీడియా, దుమ్ము లేవకుండా వేసే గ్రీన్ మ్యాట్ ను గ్రాఫిక్స్ కోసం వేసే గ్రీన్ మ్యాట్ అంటూ న్యూస్ రాసిన ఎల్లో మీడియా ఇవాళ అడ్డం గా దొరికింది.
“మనమంతా సిద్ధం” అంటూ బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ కు ఎప్పటిలానే అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టింది, సాయంత్రం 4 గంటలకు సభ వద్దకు రావాల్సిన బస్సు, తమ అభిమాన నాయకుడు జగన్ ను చూడాలని ఎగబడటం, దారిపొడవునా తండోపతండాలుగా ఎదురు రావడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలైంది. అయినా ఒక్క మనిషీ వెనుదిరగలేదు జగన్ వచ్చేవరకూ అక్కడే ఎండలో, ఉక్కపోతలో అలాగే నిలబడి ఉన్నారు… ఆశ్చర్యం ఏమిటంటే ఎన్నడూ లేనిది జగన్ బహిరంగ సభను లైవ్ లో చూపించిన ఏబీఎన్ కు జలక్ తగిలింది. డ్రోన్ విజువల్స్ తో ఆ ఆ సభకు వచ్చిన లక్షలాది మందిని ఆ డ్రోన్ క్యాప్చర్ చేసింది. ఆ విజువల్ లోనే క్లియర్ గా అశేష ప్రజా దళం కనపడుతుంది. మొన్నటి వరకు గ్రాఫిక్స్ అంటూ ఫేక్ ప్రచారం చేసిన యెల్లో మీడియా కు ఇదో అనూహ్యమైన షాక్..రేపొద్దున మళ్లీ గ్రాఫిక్స్ అంటే ఏబీఎన్ లో కూడా గ్రాఫిక్స్ చేశారా అని ప్రజలు అడిగే ప్రమాదం ఉంది కాబట్టి మరో కొత్త ఫేక్ ప్రచారాన్ని వారు వెతుక్కోవాల్సి ఉంది..