ఎన్నికల వేల టీడీపీ ధన ప్రవాహనికి తెర లేపింది, ఓటుకి నోటుకి ఆధ్యుడైన చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా నేడు టీడీపీ అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఎన్నికల పెర్మిషన్ పొందిన వాహనంలో రెండు కోట్ల రూపాయల నగదు పోలీసులకు పట్టుబడింది.
వివరాల్లోకి వెళితే అనంతపూర్ జిల్లా అనంతపురం నగరంలో విద్యుత్ నగర్ సర్కిల్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నియమావలిలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అతి వేగంగా వెళ్తున్న టయోట ఫార్చునర్ కారుని పోలీసులు ఆపి చెక్ చేయగా అందులో రెండు బ్యాగులలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రెండు కోట్లపైన డబ్బు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ఆ వాహనం తెలుగుదేశం పార్టీ కదిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
అనంతపురం నుంచి ఆ డబ్బుని కదిరికి తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టయోటా ఫార్చునర్ రిజిస్ట్రేషన్ నెంబర్ AP 39 RQ 0999 గా ఉంది. ఈ వాహనాన్ని కదిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తన ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు.కాగా కారు నుండి స్వాధీనం చేసుకున్న నగదును , తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.