ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లకు పనిబడింది. కాదేదీ బెట్టింగ్ కి అనర్హం అన్నట్లు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది మొదలుకుని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్ధికి ఎంత మెజారిటీ వస్తుంది. ? కూటమి గెలుస్తుందా లేక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అని జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
ఇదంతా పక్కనబెడితే భీమవరంలోని బెట్టింగ్ రాయుళ్లంతా వైయస్ఆర్ సీపీ గెలుపు మీద బెట్టింగ్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినిమమ్ 100 స్థానాలతో గెలుపు మొదలుపెడుతుందని భీమవరంలో బెట్టింగ్ లు జరుగుతున్నాయని సమాచారం. భీమవరంలో ఏ బెట్టింగ్ మొదలైనా అది నిజం అవుతుందని అనాది నుంచి ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అదీకాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం 100 స్థానాలతో గెలుపు ప్రారంభిస్తుందని భీమవరం పందెం రాయుళ్లు విశ్వసిస్తున్నారని తెలిసి వైసీపీ కేడర్ లో ఉత్సాహం పెరిగింది.
ఒక్క భీమవరంలోనే కాకుండా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ గెలుపుపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. కొందరు లక్షలు, కోట్లలో బెట్టింగులు కడుతుండగా మరికొందరు ఎకరాలకు ఎకరాలను బెట్టింగులు పెడుతున్నారు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగులతో పాటు ఏపీలో జరిగే ఎన్నికలపై బెట్టింగులు కట్టడం సహజంగా మారిపోయింది. కాగా బెట్టింగుల వల్ల జీవితాలను కోల్పోయే అవకాశం ఉందని ఈజీ మనీ కోసం బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా బెట్టింగ్ రాయుళ్లు వైసీపీ గెలుపుపైనే నమ్మకం ఉంచడం విశేషం.