2019 లో ఆంధ్ర ప్రదేశ్ కు శ్రీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తరచుగా చెప్పే మాట ఒకటే ఇల్లు లేని ప్రతి పేద వాడికి పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలా సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుకున్న విధంగానే రాష్ట్రంలో దాదాపు 31.19 లక్షల స్థలం లేని పేద వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయించి ఆ స్థలాలను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఫిబ్రవరి 07వ తేది నుంచి గ్రామ సచివాలయ ఫరిధిలోనే ఆ స్థలలాకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అక్కడే జరిగేలా ఏర్పాట్లు చేసారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మొదలుపెట్టిన 10 రోజులకే 10 లక్షల ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసారు. మిగిలిన స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారం రోజులలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
గతంలో ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా ఆ స్థలం పైన పేద వాడికి పూర్తి హక్కు ఉండేది కాదు. డి – పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటి పైన సర్వ హక్కులు ఎప్పటికి లభించేవి కావు . దానితో ఉండటానికి మినహా వేరే అవసరాలు కోసం వినయోగించకోవడం కోసం కుదిరేది కాదు . ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారనున్నాయి. ఆ విధంగా జగన్ ప్రభుత్వం ఇళ్లు పట్టాలు పొందిన లబ్ధిదారులకు పది ఏళ్ల తర్వాత సర్వ హక్కులు ఉండేలా అసైన్డ్ భూములు చట్టాన్ని సవరించింది. పది సంవత్సరాల తర్వాత ఆ పట్టాలు ఆటోమేటిక్ గా సేల్ డీడ్ లాగా మారుతాయి, అనగా ఆ స్థలాలును హక్కుదారుడు కావాలి అంటే అమ్ముకోవచ్చు, రుణాలు పొందవచ్చు, ఇతర ప్రయోజనాలు కోసం వినియోగించుకోవచ్చు. . అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది.