జగన్ జూన్ 4వ తారీకున ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తిరిగి తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు జగన్ ఆదేశాల మేరకు విశాఖలోనే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తునట్టు ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖను జగన్ మార్చబోతున్నారని దానికి అనుగుణంగానే తన ప్రమాణ స్వీకారం జూన్ 9వ తేదీ ఉదయం 9:38 నిమషాలకు విశాఖలో ఉంటుందని ఆ పార్టీలోని కీలక నేతలైన బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉంటే జగన్ ప్రమాణ స్వీకారం తేదీ , సమయం ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి చూపూ విశాఖపై పడింది. జగన్ ప్రమాణా స్వీకారానికి ఒక పక్క విశాఖలో ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క ఆ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని కనులారా చూసేందుకు ఆ పార్టీ క్యాడర్ సంసిద్దమైంది. దీనికి తగ్గట్టుగానే జూన్ 8,9 తేదీలల్లో విశాఖలో ఉన్న హోటల్స్ పెద్ద ఎత్తున బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం విశాఖలో చిన్న హోటల్స్ తో మొదలై స్టార్ హోటల్స్, సర్వీస్ ఆపార్ట్మెంట్స్ వరకు అన్నీ కూడా ప్రీ బుకింగ్ అయిపొయాయని, దీని కారణం జగన్ ప్రమాణ స్వీకారం తేదీ ముందుగానే ప్రకటించడం అని విశాఖలో హోటల్ యజమానిగా ఉన్న వ్యక్తి చెబుతున్న మాట.