ఆంధ్రప్రదేశ్లోని తన సొంత గ్రామం బాపట్లలో ప్రభుత్వ ఆసుపత్రిని సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ సందర్శించారు. చికిత్స కోసం అక్కడికి వచ్చే పేదల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులను చూసిన ఆశ్చర్యపోయారు. ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వం తయారు చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపిల్లల కోసం NICU ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందును ఎలకలు తిన్న దగ్గర నుంచి నేడు జగన్ ప్రభుత్వంలో పసిపిల్లల కోసం NICU లు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రి అత్యాధునికంగా ఎన్నో సదుపాయలతో కార్పోరేట్ ఆసుపత్రికి ధీటుగా ఉందన్నారు. పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న నిజమైన అభివృద్ది అంటే ఇదే కదా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలు నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సీఎం జగన్ మార్చేశారని గతంలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్య కార్పొరేట్ పాఠశాలలో చదవాలి అంటే ఏడాదికి మూడు లక్షల పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ కార్పొరేట్ పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో లేదని చెప్పుకొచ్చారు. విద్య, వైద్య రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురిపించారు.