టీడీపీ నాయకులు నీచపు రాజకీయాలు చెయ్యడం మాత్రమే కాదు.. అసహ్యమైన చరిత్ర కూడా కలిగి ఉంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడైన లాయర్ శ్రీనివాసులు భయటపెట్టారు. రాజకీయాలపై ప్రేమతో టీడీపీ నాయకుల వెంట ఎవరూ తిరగొద్దని.. అలా తిరిగి జీవితాలు నాశనం చేసుకోవద్దని విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.
జేసీ సోదరుల వద్ద గత 20 ఏళ్లుగా న్యాయ సలహాదారునిగా పనిచేసి ఇటీవల వైసీపీలో చేరిన లాయర్ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్య లు చేశారు. జేసీ పంచన చేరి ఎవరూ జీవితాలు నాశనం చేసుకోవద్దని, ప్రభోదానంద కేసులో అమాయకులను ఇరికించింది మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడేనని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మంచితనం, మానవత్వం లేని వ్యక్తని, తన కూతురు పెళ్లి విషయంలో ఆయనను తీవ్రంగా అవమానించేలా జేసీ మాట్లాడాడని వాపోయారు. నాకు ప్రాణప్రదమైన కూతురు విషయంలోనే నీచంగా మాట్లాడిన వ్యక్తి వద్ద పనిచేస్తే.. నా జన్మకు విలువ లేకుండా పోతుందని ఆ పార్టీని వీడి బయటకు వచ్చానని లాయర్ శ్రీనివాసులు తెలిపారు.