Education: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరదృష్టి ఎక్కువ. పేద పిల్లల విషయంలో అయితే చాలా ప్రణాళికతో వ్యవహరిస్తారు. వాళ్ల చదువు(Education) విషయంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొత్త కొత్త విధానాలను అముల్లోకి తెచ్చారు. దేశంలో ఏ సీఎం చేయనన్ని పనులు చేశారు. తాజాగా ప్రభుత్వ బడుల్లో ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియెట్) విద్యకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి బుధవారం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ (ఎస్సీఈఆర్టీ), ఐబీ బోర్డు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా ఐబీకి గుర్తింపు ఉంది. మన బడుల్లో 2025 విద్యా (Education) సంవత్సరం నుంచి దీని అమలుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాదిలో టీచర్లకు, డైట్, ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు అధికారులకు శిక్షణ ఇస్తారు. బట్టీ చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి థియరీతోపాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన జరుగుతుంది. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. నైపుణ్యాలకు ఎటువంటి ఢోకా ఉండదు. ఈ సిలబస్ చదివిన పిల్లలు ప్రపంచంలోని ఎక్కడైనా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చేరగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు వేగంగా అందుకుంటారు.
వాస్తవానికి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే ఐబీ సిలబస్ చెప్పే స్కూల్స్ ఉన్నాయి. డబ్బున్న పిల్లలే వాటిల్లో చేరి చదువుతున్నారు. ఎల్‌కేజీకే అక్షరాలా 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. పదో తరగతి పూర్తయ్యే లోపు ఎంత తక్కువగా వేసుకున్నా కోటి రూపాయల వరకు వసూలు చేస్తారు. మన పిల్లలను గ్లోబల్ స్థాయికి చేర్చేందుకు జగన్ తీసుకున్న చర్యల్లో భాగంగా సర్కారు పాఠశాలల్లో ఐబీ విద్యను ఉచితంగా బోధిస్తారు.
అసలు 2019కి ముందు పేద పిల్లలు ఉచితంగా ఇంగ్లిష్ చదువుతారని ఎవరైనా ఊహించారా?, ట్యాబ్‌ల్లో కొత్త విషయాలు తెలుసుకుంటారని కలగన్నారా?, ఐక్యరాజ్యసమితికి వెళ్తారని అనుకున్నారా?.. లేదు కదా.. కానీ జగనన్న అన్నింటిని నిజం చేసేశారు. అధికారం ఇస్తే భవిష్యత్ తరాల కోసం ఏమి చేయొచ్చో చేతల్లో చూపించారు. ఇప్పుడు అంతర్జాతీయ విద్యాబోధన ఐబీని తెచ్చేశారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా చంద్రబాబు ఇప్పటికీ ఐటీ ప్రదాత నేనే. నా వల్లే మీ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటాడు. కానీ రేపటి నిజమైన వెలుగులకు నేడు పునాది వేసిన రియల్ హీరో జగన్. ఈరోజు ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతోంది. నిజమైన అభివృద్ధి అంటే ఇది. సంస్కరణలంటే ఇవి.