ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని నియోజకవర్గాలే కాకుండా, చంద్రగిరిలోను అనేక హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం వ్యవస్థల్లోని కొందరితో కుమ్మకై అధికారులను మార్చిన చోటే ఈ అల్లరలు జరిగాయని మొదటి నుండి వైసీపీ నేతలు చెబూతూ వస్తున్నారు. అలాగే పోలింగ్ సమయాల్లో బూతుల్లో పడి టీడీపీ నేతలు కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులను చేసి వైసీపీ ఏజంట్లపై బౌతిక దాడులు చేసి యథేచ్ఛగా రిగ్గింగు చేసుకున్నారని, ఈ సమయంలో వైసీపీ వారు ఎన్నికల సంఘానికి పోలీసులకి లేఖల ద్వారా ఫోన్లు ద్వారా ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలని అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సైతం చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టాలని పిటిషన్ వేశారు. ఈ ఇరువురి పిటీషనల్లో ప్రతివాదులుగా ఈసీ, సీఈవోతో పాటు మరి కొంతమందిని చేర్చారు. అంబటి రాంబాబు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.