నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ అని కేశినేని ప్రశంసించారు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ నే ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గుర్తుచేసిన నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో పాల్గొన్న కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గతంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అని ప్రచారం చేసారని, కానీ బాబు బాబు ష్యూరిటీ అంటే కొడుక్కి గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధనికుల పక్షపాతి అని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన నాయకుడని అన్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అని చెప్పి కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు కానీ సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిన చూపించారు. రాష్ట్రంలోని పిల్లలందరూ అంబేద్కర్‌లా చదువుకోవాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని నాని వెల్లడించారు.
చంద్రబాబు దగ్గర తొమ్మిదిన్నరేళ్ళు ఎంపీగా పనిచేశానని ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. మీడియా మేనేజ్మెంట్ తో జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశాడు అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడని నాని తేల్చి చెప్పారు.