రబీ సీజన్లో ఈ – క్రాప్ నమోదు వేగంగా సాగుతోంది. ఈ రబీ సీజన్లో రైతులు వారి పంట పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు అనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తుంది. దీనిని ఆధారం చేసుకొనే ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తుంది ప్రభుత్వం. జియో ఫెన్సింగ్ ద్వారా రాష్ట్రంలో పంట వేసిన ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పంట వేసిన ప్రతి రైతును వదలకుండా ఈ – క్రాప్ లో నమోదు చేస్తున్నారు.
జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దులు గుర్తించి, పంట పెట్టిన రైతు ఫోటోను ఆర్బీకే సబ్బింది ద్వారా నేషనల్ ఇన్ఫర్మాటిక్ వారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ లో రైతుకు సంబంధించిన 1బి, ఆధార్, ఆధార్ తో లింక్ అయినా బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ ఇలా అన్ని వివరాలను సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారు, ఏ తప్పులు దొర్లకుండా , పంట పెట్టిన ప్రతి రైతు నమోదు చేసుకునేలా జాగ్రతలు పాటిస్తున్నారు. పంటసాగు హక్కు పత్రం లేని రైతులతో పాటు, కార్డుల లేని రైతులు వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. పొలం ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్.చేపలు, రొయ్యలు ఉంటే ఆక్వా కల్చర్ అని, పంటలు ఉంటే క్రాప్ జోన్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు, తద్వారా డూప్లికేషన్ కి తావు లేకుండా చూసుకుంటున్నారు.
రబీ సీజన్లో సాధారణ విస్తీర్ణం 55.95 లక్షల ఎకరాలలో కాగా ఇప్పటి వరకు 38.25 లక్షల ఎకరాలలో సాగు చేశారు. ఇప్పటివరకు 37,02,301 ఎకరాల్లో పంటలను ఈ క్రాప్ లో నమోదు చేశారు. ఇందులో 34,21,189 ఎకరాల్లో వీఏఏలు, 31,86,682 ఎకరాల్లో వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పరిశీలనా కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు 20,06,326 ఎకరాలకు సంభందించి ఈకేవైసీ కూడా పూర్తి అయింది. మిగిలిన రైతులు ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 15వ తేది లోగా పూర్తి చేయాలి అని లక్ష్యం నిర్దేశించారు. సోషల్ ఆడిట్ కోసం 21 నుంచి 28వ తేదీ వరకు ప్రాథమిక జాబితాను ప్రదర్శిస్తారు అభ్యంతరాలు ఉంటే మార్చి 1 నుంచి 4వ తేది వరకు పరిష్కరించి 6వ తేదీన తుది జాబితాలు అర్బికే లో ప్రదర్శిస్తారు అని, ఈ క్రాప్ నమోదు ప్రాతిపదికనే సంక్షేమ ఫలాలు అందుతాయి అని ప్రతి వక్కరు నమోదు తప్పక చేసుకోవాలి అని ఇన్చార్జి వ్యవసాయశాఖ కమిషనర్ గెడ్డం శేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.