ఎడేక్స్ తో ఒప్పందం విద్యార్థుల భవిష్యత్తు పదిలం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచస్ధాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఎడెక్స్ల మధ్య ఒప్పందం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి అడుగులోనూ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం. రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్యా హక్కు అన్నది ఇప్పుడు కొత్త నినాదం అని అంటూ ఉంటారు, అవి అయన మాటల రూపంలో చెప్పి వదిలెయ్యలేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పాఠశాల స్థాయి నుంచే అందించాలి అనే లక్ష్యంతో ఎన్నో సంస్కరణలు వచ్చాడు. అందులో ఐబీ సిలబస్, టోఫెల్, బైజూస్ కంటెంట్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, ప్రతి స్కూల్ కి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అక్కడితో ఆగకుండా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్సుమెంట్ చేయడమే కాకుండా ఇప్పుడు ప్రపంచస్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఎడెక్స్ల మధ్య ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం . ఈ ఒప్పందం దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి 2000 వేల కోర్సులతో మేలు చేకూరుతుంది.
అందులో భాగంగానే ఇవాళ వేస్తున్న ఇంకో గొప్ప అడుగు ఎడ్‌క్స్‌తో ఈ రోజు మనం చేస్తున్న ఒప్పందం. దాదాపుగా 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజిమెంట్, రిస్క్ మేనేజిమెంట్ వంటి వర్టికల్స్ పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా అందుబాటులో కనిపిస్తాయి. మన దగ్గర ఇవేవీ కనిపించవు. ఇటువంటివి నేర్పించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రెండోది ఇటువంటి పరిజ్ఞానం మన దగ్గర లేకపోవడం కూడా మరో కారణం. ఈ రెండింటిని కూడా బ్రిడ్జ్ చేస్తూ.. ఈ కోర్సులు అందుబాటులో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల వాళ్లే. ఏకంగా మన కరిక్యులమ్‌లో భాగమై, ఈ అంశాలను బోధించేలా మన పిల్లలకు అందుబాటులో తీసుకువస్తున్నాం. ఇది పెద్ద మార్పు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్‌గా పరీక్షలు జరుగుతాయి. మన పిల్లలు ఆ పరీక్షలు పాసవుతారు. క్రెడిట్స్ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి.మనదగ్గర యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా వాళ్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి తీసుకునే ఈ డిగ్రీలో స్టాక్ ఎక్సెంజ్, రిస్క్ మేనేజిమెంట్, వెల్త్ మేనేజిమెంట్, ఫైథాన్ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయి. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయి.
అందరికీ ఆ రకంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు, ప్రతి యూనివర్సిటీలలో ఆ యూనివర్సిటీలనే, ఆ సబ్జెక్టులనే తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నమే ఈ ఎడ్‌క్స్‌తో చేసుకుంటున్న ఒప్పందం. దీనివల్ల పెద్ద యూనివర్సిటీలలో సీట్లు రాకపోయినా.. ఆ కోర్సులు మన యూనివర్సిటీలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇది గొప్ప మార్పు. నాణ్యమైన విద్య మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తున్నాం. ప్రతి వైస్‌ఛాన్సలర్‌కి చెబుతున్నాను. మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. ఆన్లైన్ కేపబులిటీని పెంచాలి. మన దగ్గర రిజిస్ట్రేషన్లు బాగా జరిగేలా చూడాలిని సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు