పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 6,23,092 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవ్వగా 5,20,564 విద్యార్థులు పాస్ అయ్యారు, 1,02,528 మంది ఫెయిల్ అయిన విద్యార్ధులు ఉన్నారు.
పదవ తరగతి ఫలితాల్లో ఓవరాల్ గా 86.69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతంతో బాలికలు సత్తా చాటారు. ఫలితాలలో బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 గా ఉంది. జిల్లాల వారిగా ఫలితాల్లో టాప్ చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా 93.7 శాతంతో టాప్ లో నిలవగా, చివరి స్థానంలో 67 శాతంతో కర్నూలు జిల్లా నిలిచింది. రాష్ట్రంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిని స్కూళ్ళు 2300 కాగా, ఒక శాతం కూడా ఉత్తీర్ణత సాధించని స్కూలు 17 ఉన్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఫెయిల్ అయిన వారికి మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మీడియతో తెలిపారు.