భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఇంకా ఖాయమైనట్టే ఉంది. అందులో భాగంగానే ఆయన, అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను “రౌడీ” అంటూ సంబోధించి విమర్శలు చేయడం. తనకు కావలసిన చోట ఎంతలా ఊగిపోయి అయినా మాట్లాడే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా నిన్న భీమవరం ఎమ్మెల్యే గురించి అసత్యాలు మాట్లాడారు. ఏదో కేడర్ని ఉత్సాహపరచేందుకు ప్రభుత్వం పైనా, పాలనా పైనా విమర్శలు చేయడం మామూలే కానీ… పవన్ కావాలని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ “రౌడీ” అన్నారు.
అయితే దీనికి ధీటుగా సమాధానం ఇచ్చిన గ్రంధి “నేను రౌడీ అన్న పవన్ … . నామీద క్రిమినల్ కేసు ఎక్కడైనా రికార్డుల్లో ఉందా?” అంటూ పవన్ విమర్శలను తిప్పి కొట్టారు. కేవలం ఇప్పుడు ఓట్లు కోసం భీమవరం వచ్చి ఇలా కాకమ్మ కబుర్లు పవన్ చెప్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన పవన్ తీరు నీ, ప్రవర్తననీ తప్పుబట్టారు.
“విద్యార్థుల చదువు కోసం రూ.3 కోట్ల విలువైన భూములు ఇచ్చామనీల ఆస్పత్రి నిర్మాణం కోసం 4 ఎకరాల భూమిని ఇచ్చామనీ” గ్రంధి తెలియజేసారు.
నిజానికి పవన్ భీమవరం నుంచి పోటీ చేసి వెళ్లాక కనీసం నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు.
కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం మీరు భీమవరం రాలేదు కూడా.
ఇవన్నీ ఏకరువు పెడుతూ…గ్రంధి “నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను” అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఇప్పుడు జనసేనలో చేరిన పులవర్తి రామాంజినేయులు 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు. మరి 10 ఏళ్లలో డంపింగ్ యార్డ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు. అని ప్రజాసమస్యలపై పని చేయని గత పాలకులను విమర్శించారు.
తాడేరు గ్రామంలో డంపింగ్ యార్డ్‌కు సంబంధించి 6.60 ఎకరాలు ల్యాండ్ ఆక్విజిషన్ చేసి స్వాధీనం చేసుకున్నామనీ, మేము ఇప్పటికే చేసి చూపించామనీ,ఊసరవెళ్లిలాగా పార్టీలు మార్చే వ్యక్తి పులపర్తి అనీ,ప్రొటెక్టివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమును అడ్డుపెట్టుకొని భీమవరం మండలంలో రైతులను మోసం చేశాడనీ, ప్రజలకు మంచి నీరు ఇవ్వాలని చెప్పి 50 ఎకరాల భూమిని తన సొంతానికి రాయించుకున్నాడనీ… పులవర్తిపై ఘాటైన విమర్శలను చేసారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి పవన్ పక్కన చేరాడనీ అంటూ పవన్ తనని రౌడీ అంటూ చేసిన విమర్శలను తిప్పికొట్టారు.