గత పాలకులకి జగన్ పాలనకి ఎంత మార్పు.. మరీ ముఖ్యంగా విద్యారంగాన్ని మెరుగు పరచడానికి ముఖ్యమంత్రిగా జగన్ చూపిస్తున్న శ్రద్ద దేశంలో మరే రాష్ట్రంలో కనిపించదు. పాడుబడ్డ స్కూళ్ళను కార్పొరేట్ స్కూళ్లకి ధీటుగా తయారు చేయడం దగ్గరనుండి, పిల్లలకి అందించే విద్యలో నాణ్యత పెంచడం వరకు జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయం ఒక మైలు రాయిగానే నిలిచింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకి సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయడంలో జగన్ సర్కార్ 5ఏళ్ళు పూర్తిగా సక్సెస్ అయింది.
గతంలో టీడీపీ హయాంలో నవంబర్, డిసెంబర్ వరకు కూడా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందేవి కావు. కానీ ఇప్పుడు జగన్ 5ఏళ్ళ పాలనలో ప్రతీ ఏడూ పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు పుస్తకాలు సిద్ధం చేయించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు పుస్తకాలు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉంచారు. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. గతంలో ఇంత త్వరగా పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడేవారని జగన్ ప్రభుత్వం వచ్చాగా సకాలంలో పుస్తకాలు అందడంతోనే విధ్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించడం జరుగుతుందని తల్లితండ్రులు చెబుతున్న మాట.