అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేతల వలసలు పెరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన గతంలో రెండుసార్లు కార్పొరేటర్ గా, ఒకసారి డిప్యూటీ మేయర్ గా సేవలందించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం గోగుల వెంకట రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం లభించడం లేదని, టీడీపీలో బీసీలకు గౌరవం లేదని ఆరోపించారు. కానీ జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సి, ఎస్టీ , మైనారిటీలకు ఉన్నత పదవులు కల్పిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పాల్గొన్నారు.