జనసేనకు భీమవరంలో మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎలక్షన్స్ కోసం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంను జనసేన అభ్యర్థి భీమవరంలో ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద కొత్తగా ఏర్పాటు చేశారు. ఉదయం పూట మంచి ముహూర్తం జన సేన వీర మహిళలు, జన సైనికుల కోలాహలం తో ధూమ్ ధాంగా ఓపెన్ చేసిన కొద్ది సేపటికే ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు వచ్చి క్యాంప్ కార్యాలయం తాలూకు అనుమతి పత్రాలు చూపించమని కోరడంతో ఇదిగో అదిగో అంటూ సాయంత్రం వరకు కూర్చోబెట్టి చివరకు అనుమతి పత్రాలు సమర్పించలేక పోవడంతో ఎన్నికల అధికారులు జన సేన క్యాంప్ కార్యాలయం దుకాణం బంద్ చేశారు. కార్యాలయం ఓపెన్ చేసిన ఐదు గంటలకే మూత పడటంతో జన సేన కార్యకర్తలు దీనిని మొదటి ఎదురుదెబ్బ గా అపశకునంగా భావిస్తున్నారు.
టీడీపీ,జన సేన, బిజెపి కలిసి కూటమిగా ఏర్పడి పోటి చేస్తున్న తరుణంలో భీమవరం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ స్వయంగా టీడీపీ నాయకుడు అయిన పులవర్తి ఆంజనేయులును జన సేన పార్టీలోకి అహ్యానించి భీమవరం టికెట్ కేటాయించారు. దానితో జన సేనలో నాయకులు తీవ్ర స్థాయిలో నిరుత్యాహనికి గురి అయ్యి జన సేన పార్టీలో నాయకులే లేరా టీడీపీ వారిని పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వడం దేనికి అదేదో టీడీపీనే పోటి చెయ్యమంటే సరిపోతుందిగా అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అసలే ప్రత్యక్ష రాజకీయాలకు గత ఐదు సంవత్సరాలుగా దూరంగా ఉన్న పులవర్తి ఆంజనేయులు టీడీపీ, జన సేన, బిజెపి నాయకుల మద్దతు కోసం ముందు ఉమ్మడిగా ఓక క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చెయ్యదలచి భీమవరంలో ఎడ్వర్డ్ ట్యాంక్ లో ఓపెన్ స్థలం లో కొత్త క్యాంప్ కార్యాలయం నిర్మించి, మూడు పార్టీల జెండాలతో అలంకరించారు.
నిన్న మాంచి ముహూర్తం వుందని మూడు పార్టీల నాయకులను, కార్యకర్తలను పేరు పేరున ఆహ్యనం పంపి కోలాహలంగా కొత్త కార్యాలయం ఓపెన్ చేశారు. కొద్ది సేపు మూడు పార్టీలా నాయకులు కార్యకర్తలతో కళకళలాడింది. ఇంతలో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు రావడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రారంభించారు అని తెలుసుకుని ఆఫీసును క్లోజ్ చేశారు. దీనితో ఐదు గంటలు కూడా లేకుండానే ఎలక్షన్ క్యాంప్ కార్యాలయం మూత పడటంతో నియోజకవర్గం అంతటా ఇదొక అపశకునం అంటూ మాట్లాడుకుంటున్నారు.