2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కూటమిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత జనసేన రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో జనసేన గుర్తు అయిన గ్లాస్ టంబ్లర్ ను ఫ్రీ సింబల్ ఈసీ ప్రకటించింది. అంటే జనసేన పోటీ చేయబోయే 21 స్థానాలతో పాటు 154 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా గాజు గ్లాస్ గుర్తుతో ఎవరైనా పోటీ చేయవచ్చు. అలా నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ జరిగిన తర్వాత 52 స్థానాలలో గాజు గ్లాస్ గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. దీంతో జనసేన పార్టీ హైకోర్టుకి వెళ్ళింది.
ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు కానీ కొంత మేర రిలీఫ్ లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికీ కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమీషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈమేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్లో పేర్కొంది. దీంతో అభ్యర్థులు ఇప్పటికే గాజు గ్లాసు గుర్తుపై ప్రచారం మొదలుపెట్టి రెండు రోజులు కావొస్తున్న సందర్భంగా స్వతంత్ర అభ్యర్థులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు పాటిస్తారా లేక తిరిగి హైకోర్టుకి వెళ్తారా అనే విషయం చూడాలి.