దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపు అనగా శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనున్నట్టు తెలిపింది.
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా అదే సమయంలో బలంగా ఉన్న సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. 175 స్థానాలను గెలుచుకుంటామని వైసిపి బలంగా నమ్ముతుంటే మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేక ఓటును మేము చీలనివ్వమని బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఆ మూడు పార్టీలు నమ్ముతున్నాయి.
రేపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.