సంవత్సరాల తరబడి చంద్రబాబు “ప్రభుత్వ విద్య” అనే విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే మనకి దిమ్మ తిరగడం ఖాయం. ప్రతి ఏటా, ప్రతి పూటా నోటికొచ్చిన మాటలు, ప్రకటనలు, వాగ్ధానాలు, అభిప్రాయాలు వస్తూనే ఉంటాయి, అవి మారుతూనే ఉంటాయి. అసలు ఒక నిలకడ కలిగిన అభిప్రాయం అంటూ ఉండకపోవడం చంద్రబాబు వంటి వారికి ఉన్న అధ్బుతమైన లక్షణం.
ఒకానొక సమయంలో, అసలు విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని అన్నారు. అంతే కాక, ఎప్పుడూ ప్రపంచ స్థాయిలో చెప్పే పోలికలతో… పేరుపొందిన యూనివర్సిటీలన్నీ ఇలానే ఏర్పడ్డాయని, కార్పొరేట్లే విద్య బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోమని, సలహా ఇచ్చి, విద్యని వారి పరం చేయడానికి బిల్లుని కూడా ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆశలు కూడా పెట్టుకున్నారు. విద్య విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయాలకున్న విషయాన్ని కూడా చాలా పాలిష్డ్ గా చెప్పి, పత్రకాముఖంగానే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇపుడు నాడు నేడు కార్యక్రమం, విద్యా దీవెన, అమ్మ ఒడి వంటి పధకాలతో ప్రభుత్వ విద్యకి జగన్ ప్రభుత్వం కొత్త సొబగులద్దిన వేళ, చంద్రబాబు మళ్ళీ ఇంకో కొత్త పాట అందుకున్నారు. బడులకు రంగులేసినంత మాత్రాన పిల్లలకి చదువులొచ్చేయవని, తాను ముందు చూపుతో చేసిన పనులు వల్లే ఇపుడు ప్రతి గ్రామం నుంచి యాభై మందికి పైగానే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, అదంతా నా చొరవే అని పేరు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అంతే కాక, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి అని అనుకున్నప్పుడు ప్రతిపక్షం, వాళ్ళ మిత్రుడు పవన్ కళ్యాణ్ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇపుడు అసలు తాను ఇంగ్లీషు మీడియానికి వ్యతిరేకమే కాదనీ, తాను ఇంగ్లీషు మీడియాన్ని ప్రోత్సహించడం వల్లే సాఫ్ట్వేర్ జాబులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
అసలు మాటలు మార్చడంలో ఈయన ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నారో ఏ యూనివర్సిటీ కూడా కనిపెట్టిలేనంతగా రాటుదేలారు చంద్రబాబు!!