వాలంటీర్లను గౌరవం భృతి తీసుకుని పని చేసే సేవకులుగా జగన్ ప్రభుత్వం చూసినప్పటికీ… టీడీపీ మాత్రం మొదటి నుంచీ వారిని వైసీపీ అనుచరులలానే భావిస్తోంది. ఎన్నో సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థ వలన కలిగిన లాభాలు, ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ వంటివి కళ్ళ ముందు ఉన్న కేవలం రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ వాలంటీర్లను వ్యతిరేకిస్తుంది.
ఈ నేపధ్యంలో ఎన్నికలలో ఏ విధమైన డ్యూటీకి వాలంటీర్లను వాడబోమని వైకాపా స్పష్టం చేసింది. అయినా టీడీపీ పదేపదే వాలంటీర్ల వ్యవస్ధను అనుమానిస్తున్న నేపధ్యంలో… ఎన్నికల కమిషన్ వాలంటీర్లకు ఎన్నికల నిబంధనావళిని విడుదల చేసింది.