అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని వీడబోతున్నారంటూ పచ్చ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది.. అయితే ఆ విషయంపై గురునాథ్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు.. మేము వైఎస్ కుటుంబానికి విధేయులమని.. జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేందుకు నా వంతు కృషి నేను చేస్తానన్నారు..సీఎం గారు ఆయనకు ఏ బాధ్యత అప్పగించినా దానిని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్టు వస్తున్న దుష్ప్రచారాన్ని నమొద్దన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినా.. ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని.. వైఎస్ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆరోజే మంత్రి పదవి ఇస్తామన్నా కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడిచామన్నారు.. అలాంటిది ఇప్పుడెలా పార్టీ మారతామని ఆయన ప్రశ్నించారు.. ఎమ్మెల్యే టికెట్ విషయంలో సీఎం జగన్ గారి నిర్ణయమే నా నిర్ణయమని గురునాథ్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
టీడీపీ మరియు పచ్చ మీడియా ఇలాంటి ఆరోపణలు.. తప్పుడు వార్తలు రాయడం ఇదేం మొదటిసారి కాదు.. ఇలాంటి చెత్త స్ట్రేటజీలు మొదటి నుండి చంద్రబాబు అనునాయులకు అలవాటే.. ఇక ఇప్పుడైతే 2024 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో భయంలో టీడీపీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తుంది.