ఒకడు ఏడవడానికి ఏ వంకా దొరక్క , ఇంటి వెనుక ఉన్న డొంక (ముళ్ళ కంప) ని పట్టుకుని , నాకు ముళ్ళు గుచ్చుకున్నాయి మొర్రో అని గగ్గోలు పెట్టాడంట. ఈ సామెత ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. 2014 ఎన్నికల్లో ఏ హామీని పూర్తిగా నేరవేర్చని చంద్రబాబు పూర్తిగా ప్రజల ఆగ్రహానికి గురై గతంలో ఎన్నడు లేని విధంగా భారీ స్థాయి ఓటమిని మూటకట్టుకున్నాడు.
తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్, వచ్చి రాగానే కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కుని కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా 98% హామీలని నెరవేర్చి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా పరిపాలనలో సమూల మార్పులకి శ్రీకారం చుట్టి ప్రజలకి మరింత దగ్గరయ్యారు. ఐతే అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతిపక్షనేతగా కన్నా , పరిపాలనా దక్షతతో ప్రజలకి మరింత దగ్గరవ్వడం ఏమాత్రం సహించలేని తెలుగుదేశం పార్టి అధినేత చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏ వంకా లేక నిత్యం అసత్యాలు పలుకుతూ ప్రజలని తపు దోవ పట్టించే ప్రయత్నంలో పూర్తిగా నిమజ్ఞమయ్యారు.
జగన్ పై విమర్శలకి పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు ఎంచుకున్న అంశాల్లో రాష్ట్రంలోని రోడ్లు పరిస్థితి కూడా ఒకటి, జగన్ వచ్చాక కొత్త రోడ్లు నిర్మాణం పూర్తిగా వదిలేశారని. కనీసం దెబ్బతింటున్న రోడ్లని మరమ్మత్తులు కూడా చేయడంలేదని, దీంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన పాలనలోనే ఎక్కువ రోడ్లపై ఖర్చు చేసి బాగుచేశామని, జగన్ నిర్లక్ష్యంతో రాష్ట్రం మరో వందేళ్ళు వెనక్కి వెళ్ళిందంటూ అసత్య పలుకులే ప్రచార అసత్రాలుగా ప్రజల్లో తిరుగుతున్నారు.
చంద్రబాబు చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజాలు ఏంటని చూస్తే, చంద్రబాబు పాలన, జగన్ పాలనను పోల్చుతూ రోడ్లపై వారు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం బయటపడుతుంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరమ్మతుల నిర్వహణ కూడా ఏమాత్రం పట్టించుకోని వైనం కనిపిస్తుంది. రోడ్ల పునరుద్ధరణకు అంటూ 2017–18లో 3 వేల కోట్ల రుణం తెచ్చి ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందడానికి ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించిన నిజాలు తెలుస్తాయి.
చంద్రబాబు పాలన ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు కేవలం 2,953.81 కోట్లు మాత్రమే, రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు 4,325 కోట్లే అన్న విషయం, పంచాయతీరాజ్ రోడ్ల కోసం చేసిన ఖర్చు కేవలం 3,160.38 కోట్లు మాత్రమే అనే విషయం. ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు 23,792.19 కోట్లు మాత్రమే అనే నిజం బయట పడుతుంది.
ఇక జగన్ గారి పరిపాలనలో రోడ్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా అని చూస్తే, ఎక్కడా కూడా చంద్రబాబు 5ఏళ్ళు లో నేడు జగన్ గారు రోడ్ల నిర్మాణంపై చేస్తున్న ఖర్చుతో పోలికే ఉండదు. వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేప్పట్టింది జగన్ సర్కార్. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు కూడా మోక్షం కలిగించింది జగన్ ప్రభుత్వం. రోడ్ల మరమ్మతులకు 4,148.59 కోట్లు, రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి 7,340 కోట్లు, పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి 5,443.69 కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి 25,304 కోట్లు, మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం చూతే 42,236.28 కోట్లు, మొత్తంగా రోడ్ల నిర్మాణం చూస్తే 7,600 కిలోమీటర్లు చెప్పట్టినట్టు. అధికార లెక్కలే చెబుతున్నాయి.
ఈ లెక్కన ఎక్కడా కూడా చంద్రబాబు పాలనలతో పోల్చి చూస్తే జగన్ గారు రాష్ట్ర రహదారుల నిర్మాణం పునరుద్దరణ మీద చేసిన ఖర్చు అలాగే కిలోమీటర్ల లెక్క అత్యధికంగా నిర్మించిన రహదారులే ఎక్కువని తెలుస్తుంది. వాస్తవాలు ఇలా ఉంటే పాత ఫోటోలతో, అలాగే ఎక్కడో ఒక చోట మరమ్మత్తులు జరుగుతున్న గామీణ రోడ్లనో చూపిస్తూ, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ రాష్ట్రం మొత్తం రోడ్ల పరిస్థితి అలాగే ఉన్నట్టు రాష్ట్ర ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నం జనసేన, తెలుగుదేశం నిత్యం చేస్తూనే ఉన్నాయి . ఎన్నికల్లో ఓట్ల కోసం టీడీపీ చేస్తున్న ఈ స్టంట్ ప్రజలు నమ్ముతారో లేక ఓట్ల రూపంలో బుద్ది చెప్పి మరోసారి ఇంటికి పంపుతారో రానున్న ఎన్నికల రణక్షేతంలో తేలిపోతుంది.