1995 లో ఎన్టీఆర్ వద్ద నుండి అధికారాన్ని లాక్కున్న తర్వాత 96 లో రాబోతున్న పార్లమెంట్ ఎలెక్షన్ ని దృష్టిలో పెట్టుకొని పదవ తరగతి పూర్తయ్యి ఉద్యోగం లేని వారికి నూతన సంవత్సర కానుకగా 100 రూపాయల భృతి ఇస్తానంటూ మొదటిసారి నిరుద్యోగ భృతి పధకానికి తెర లేపారు. కానీ 1996 పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఒక్కరికి కూడా భృతి అందించకుండానే ఈ పధకం అటక ఎక్కింది.
మళ్ళీ 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా బయటకి వచ్చింది నిరుద్యోగ భృతి. నాటి నుండి నేటి వరకూ నిరుద్యోగ భృతి తిరిగినన్ని మెలికలు నాగు పాము కూడా తిరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఇలా తానెదుర్కొనే ప్రతి ఎన్నికలోనూ ఒకే పధకం పేరు చెప్పి జనాల్ని మోసం చేయడంలో చంద్రబాబుని మించిన సిద్దహస్తుడు మరొకరు ఉండకపోవచ్చు .