ధాన వీర శూర కర్ణడిలా ఎప్పటికప్పుడు ప్రజలకు హామీలు గుప్పించే చంద్రబాబు.. ఆ హామీలు నెరవేర్చిన దాఖలాలు మాత్రం లేవు. ఆకాశాన్నంటే అభయాలతో ఎన్నికల ముందు గొప్పలకు పోయే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆల్జీమర్స్ వచ్చినవాడిలా ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతాడు. ఎన్నికల హామీలు నెరవేర్చడం సాధ్యం కాదంటూ ప్రజలపై ఎదురుదాడికి దిగుతాడు.. ఇదే చంద్రబాబు గతం వర్తమానం భవిష్యత్తు కూడా..
1995 లో వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన బాబు తర్వాత 1996 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని ఒక్క అంశాన్ని కూడా అమలుచేయలేదు. నిరుపేదలకు కిలో రెండు రూపాయల బియ్యం కొనసాగిస్తామని చెప్పి బియ్యం ధర 3.50కు పెంచడమే కాకుండా కోటా కూడా తగ్గించింది బాబు ప్రభుత్వం. మద్యపాన నిషేధాన్ని అమలు పరిచేలా చేస్తానని చెప్పిన చంద్రబాబు ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోనే మద్యనిషేధాన్ని ఎత్తివేశారు. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ కు ఒక్కో హార్స్ పవర్ కు 50 రూపాయలు మాత్రమే చార్జీ వసూలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు ప్రభుత్వం.. రైతుల నడ్డివిరిగేలా విద్యుత్ చార్జీలు పెంచారు, నీటి పన్ను కూడా పెంచారు.. నీటి పన్ను, విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగిన రైతులను కాల్చి చంపించాడు చంద్రబాబు.
ఆ సమయంలో రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వంలోని నేతలు మాటలు చెబుతున్నారని.. ఆ మాటలు నమ్మే రోజు పోయాయని నిరుద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు లాంటి నాయకుడికి ఓటు వేసేదే లేదని తెగేసి చెప్పారు.
ఇలా చంద్రబాబు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవీ కాలం మొత్తం అలవిగాని హామీలు ఇవ్వడం, కొండ మీద కోతిని తెస్తాను అనడం, ఎన్నికలు అయ్యాక హామీలు నెరవేర్చమన్న జనంపై విరుచుకుపడడం లాంటి విపరీత ధోరణి తోనే పరిపాలన ఇలాంటి సాగింది కానీ తన పాలనా కాలంలో చెప్పుకొదగ్గ మంచి సంక్షేమ పధకం ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు