ఎన్టీ ఆర్ ను దించేసి పదవి లాక్కున్న తర్వాత చంద్రబాబు తన కుంభకోణాల కు శ్రీకారం చుట్టింది ఒక పుస్తకాల కుంభకోణంతో
దాని విలువ అప్పట్లోనే అక్షరాలా 70 లక్షల రూపాయలు
సాంఘిక సంక్షేమ శాఖ కమ్యూనిటీ గ్రంథాలయాల కోసం మంచి సాహిత్యాన్ని, ఇతర ఉత్తమ గ్రంథాలను కొని ప్రజలను చైతన్య వంతుల్ని చేయాలి . అది ఆ శాఖ బాధ్యత
అయితే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సాహిత్య విలువలున్న పుస్తకాల సంగతి పక్కన పెట్టి , “ ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వారి దగ్గర పుస్తకాలు కొనటం “ పద్ధతిని ఎంచుకుని బహిరంగంగానే ముడుపులు అడగటం తో రాత్రికి రాత్రే పుస్తకాల ధరలు మారి 10 రూపాయల పుస్తకం 50 రూపాయలకు చేరింది
35% కమిషన్ ఇస్తేనే పుస్తకాలు కొంటామని అధికారులు తెగేసి చెప్పారని ప్రచురణ కర్తలు బయట పెట్టారు
ప్రధాన ప్రచురణ కర్తలకు తెలీకుండా రహస్యంగా ఈ వ్యవహారం జరగటం తో దాదాపు 70 లక్షల రూపాయల కుంభకోణం జరిగింది. దీని వెనక బాబు హస్తం ఉందని విచారణ జరిపించాలని కాంగ్రెస్ నిలదీసినా సమాధానమివ్వలేదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.
చంద్రబాబు చేసిన మరిన్ని కుంభకోణాల వివరాలను ఒక్కొక్కటి గా మీ ముందుకు తీసుకు రాబోతున్నాం