శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి చైర్మన్ మోషేను రాజుకు పార్టీ కేంద్ర కార్యాలయం లేఖ పంపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి , 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించారు కనుక శాసనమండలి నుంచి వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
గతంలో వైఎస్సార్సీపీ నుండి ఫిరాయించిన కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య, విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్ లపై ఇప్పటికే అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. జంగా కృష్ణమూర్తి పై కూడా అనర్హత వేటు వేస్తారు అని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. గతంలో జంగా కృష్ణ మూర్తి టీడీపీలో సరైన గౌరవం దక్కలేదు అని వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడు. వైఎస్ఆర్సీపీ లో జంగా కృష్ణ మూర్తి స్థాయికి తగ్గట్టు ఆ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గా, తర్వాత 2019 లో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ అవకాశాన్ని జంగా కృష్ణ మూర్తికి కేటాయించారు అయినా జంగా కృష్ణ మూర్తి ఇవన్నీ మర్చిపోయి టీడీపీ లో జాయిన్ అయ్యాడు. జంగా కృష్ణ మూర్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో చూడాలి.