నారా లోకేశ్ ప్రభుత్వ బడిలో చదవలేదు. ఎవరో పెట్టుబడి పెడితే విదేశాలకు వెళ్లాడు. ఆయన తండ్రి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సర్కార్ స్కూళ్లను ఏ విధంగా నాశనం చేశాడో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ హయాంలో మనబడి నాడు– నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి కొత్త కళ సంతరించుకున్నాయి. అయితే లోకేశ్ జగన్ వల్ల పాడుబడి అంటూ మాట్లాడి అభాసుపాలయ్యాడు.
నాడు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేట్ స్కూళ్లు రాజ్యమేలాయి. ప్రభుత్వ బడులు రూపురేఖలు కోల్పోయాయి. ఈ విషయం అందరికీ తెలుసు. టీచర్లు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు. తరగతి గదులు సరిపోక ఆరుబయట బోధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరుగుదొడ్లు, నీటి వసతి ఉండేది కాదు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. సర్కార్ బడికి పిల్లల్లి పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపేవారు.
నేడు
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పరిస్థితి పూర్తిగా మారింది. నాడు – నేడు పథకాన్ని ప్రారంభించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడుల్లో వసతులు కల్పించారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. సిలబస్‌లో మార్పులు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు స్కూళ్లు పునఃప్రారంభించిన రోజే ఇస్తున్నారు. జగనన్న విద్యాకానుక అందుతోంది. పిల్లలు షూ వేసుకుని, బెల్టు పెట్టుకుని, బ్యాగ్ తగలించుకుని దర్జాగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. నేడు నేల కూర్చొనే పరిస్థితి లేదు. మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్చి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిదో తరగతి వారికి బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ప్రభుత్వం అందజేసింది. పిల్లల తల్లులకు అమ్మఒడి పథకం అందుతోంది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది.
పచ్చ కళ్లకు..
ఇంత జరిగితే టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా పెద్దలు సర్కార్ బడులపై విషం కక్కుతూనే ఉన్నారు. కార్పొరేట్ నుంచి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరుతుండడంటో వారి బాధ వర్ణనాతీతం. అందుకే అమ్మఒడిపై ఇష్టానుసారం మాట్లాడారు. ట్యాబ్‌లపై చెత్త వ్యాఖ్యలు చేశారు. నాడు – నేడును తిట్టారు. ఇంగ్లిష్ మీడియంపై కోర్టుకెళ్లారు. తమ పార్టీకి ఆర్థిక వనరుగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థ పెద్ద నారాయణ కోసం చంద్రబాబు, లోకేశ్ ఎప్పుడూ ప్రభుత్వ బడులపై పడి ఏడుస్తుంటారు. స్కూళ్లలో అసాంఘిక కార్యకలాపాలంటూ నోటికొచ్చింది చెబుతుంటారు. ట్యాబ్‌లు, వసతులు చూసి వారికి మతి పోయినట్లుంది. అందుకే మద్యం, గంజాయి అంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. పిల్లల విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న తండ్రీకొడుకులకు వచ్చే ఎన్నికల్లో తల్లిదండ్రులు గుణపాఠం చెప్పడం ఖాయం.