తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ శాఖను ఆధునిక బాట పట్టించి అనేక అభివృద్ధి పనులు చేయించారు. 19.58 లక్షల వ్యవసాయ వినియోగదారులకు పగలే 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించి డిమాండ్ 10,324 మిలియన్ యూనిట్ల నుంచి 13,185 మిలియన్ యూనియట్లకు పెరిగింది. ఇందులో భాగంగా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు.
యూనిట్‌కు రూ.2.49 చెల్లించేలా ప్రభుత్వం సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా చేసుకుంది. రూ.3,000 కోట్లతో 28 భారీ సబ్స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. జిల్లాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం చేశారు. కాలం చెల్లిన కండక్టర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరా కోసం కొత్త సబ్స్టేషన్లు కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో 11 కేవీ విద్యుత్ లైన్లు, ఎల్టీ లైన్లు, డీటీఆర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి 5 లక్షల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఐదువేల మంది జనాభా కలిగిన గ్రామాల్లో సరఫరాలో అంతరాయం లేకుండా త్రీ ఫేజ్‌ను అందించేందుకు కొత్త లైన్లు వేశారు.